Begin typing your search above and press return to search.

చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు వైసీపీ ప్రచారమట?

By:  Tupaki Desk   |   1 Aug 2020 11:30 AM GMT
చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు వైసీపీ ప్రచారమట?
X
మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయడానికి నిర్ణయించారని.. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్టు మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై స్పందించారని తెలిసింది.

ఈ వార్త టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో టీడీపీ ముఖ్యులు స్పందిస్తున్నారు. అలాంటిదేమీ లేదని.. ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారమని.. తాము అమరావతి తరలింపు మీద ఆగ్రహంగా ఉన్నాం కానీ రాజీనామాలు ఏం చేయడం లేదని కొంతమంది టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.

రాజీనామాల విషయంలో కొంత మంది టీడీపీ నాయకులు రాజీనామాలకు మొగ్గు చూపుతున్నారని.. కొంతమంది వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. అందరూ రాజీనామా చేస్తారన్న ప్రచారం నిజం కాదని కొంతమంది టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఏడాదికే రాజీనామా చేయడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.

రాజధాని అమరావతి మార్పుపై పోరాడుతామని.. కానీ రాజీనామా చేస్తామనడం వట్టి ప్రచారమేనని టీడీపీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఇది వైసీపీ చేస్తున్న ప్రచారమని కొట్టిపారేస్తున్నారు.