Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో టీచర్ పాఠాలు .. చంపుతామంటూ బెదిరింపులు !

By:  Tupaki Desk   |   28 Aug 2020 5:00 AM IST
ఆన్ లైన్ లో టీచర్ పాఠాలు .. చంపుతామంటూ బెదిరింపులు !
X
కరోనా నేపధ్యంలో పాఠశాలలు తెరుచుకోవడంలేదు. దీంతో విద్యార్ధులు పాఠాలకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో... ప్రైవేటు ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో పాఠాలు చెప్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మార్చి 25 నుండి లాక్ డౌన్ అనౌన్స్ చేసారు. అప్పటి నుండి స్కూల్స్ అన్ని మూసేసారు. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తున్నప్పటికీ స్కూల్స్ ఇప్పట్లో తెరచేలా కనిపించడం లేదు. దీనితో తమ పిల్లలు వెనుకబడకుండా ఉండేందుకు ఇంటి నుండే ఆన్ లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అలాగే, ఇప్పుడిప్పుడే దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ఆన్ లైన్ భోదన వైపు చూస్తున్నాయి. విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ ను నష్టపోకుండా ఆన్ లైన్ లో క్లాసులు ప్రారంభించాలని అనుకుంటున్నాయి.

అయితే, ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ విద్యాభోదనను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ లో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ హిమాయత్‌ న‌గ‌ర్ ‌లో విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు చెబుతోన్న ఓ టీచ‌ర్‌ ను చంపుతామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. అయితే , కరోనా హాలిడేస్ లో కూడా ఆన్ లైన్ క్లాసులు చెప్తుండటంతో ఎవరో విద్యార్థి కావాల‌నే ఇలా చేసిన‌ట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో స‌ద‌రు టీచ‌ర్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ వేదిక‌గా క్లాసులు చెబుతున్నారు. కాగా బెదిరింపుల‌తో కంగుతిన్న టీచ‌ర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.