Begin typing your search above and press return to search.

ఎంపీ నుస్రాత్‌ జహాన్‌ చంపేస్తామని బెదిరింపులు !

By:  Tupaki Desk   |   1 Oct 2020 2:00 PM IST
ఎంపీ నుస్రాత్‌ జహాన్‌ చంపేస్తామని బెదిరింపులు !
X
సోషల్‌ మీడియా వేదికగా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, నటి నుస్రాత్‌ జహాన్‌ భారత హై కమిషన్‌ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె బెంగాలీ సినిమా షూటింగ్‌ లో భాగంగా లండన్‌ లో ఉన్నారు. దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని తీసిన ఓ వీడియోను పోస్ట్‌ చేశాక బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా సాధారణంగానే ఆమెకు భద్రత ఉంటుంది.

అయితే బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారాఅదనపు భద్రత కూడా ఏర్పాటైనట్లు సమాచారం అందింది. తనకు రక్షణ కావాలంటూ భారత హైకమిషన్‌ కు రాసిన లేఖలో ఆమెకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కూడా ఉంచినట్లు తెలిపారు. సింధూరం ధరించడం వంటి చర్యల కారణంగా గతంలో ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే , బెంగాలీ సినీ పరిశ్రమలో తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది.