Begin typing your search above and press return to search.
అంబటి రాంబాబు పేరుతో వ్యాపారికి బెదిరింపులు ...భూమిని కబ్జా చేసేందుకు యత్నం !
By: Tupaki Desk | 25 Sept 2020 2:40 PM ISTవైసీపీ కీలక నేత , అంబటి రాంబాబు పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమప్రసాద్ ఆరోపణలు చేసారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి తనను ఫోన్ లో అంబటి రాంబాబు పేరుతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఫోన్ సంభాషణను అందించినట్టు తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, నీ సంగతి తేలుస్తామని... ముక్కలుగా నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన హనుమాన్ ప్రసాద్ ఆ వివరాలు తెలిపారు.
నరసరావుపేట రోడ్డులో తనకు 11 సెంట్ల భూమి ఉందని, దానిని కబ్జా చేసేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. దీనితో శ్రీనివాసరెడ్డి తనకు అర్ధరాత్రి అంబటి రాంబాబు పేరుతో ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టినందుకు అంతు చూస్తానని బెదిరించాడని, రోడ్డు దగ్గరకు వస్తే ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, ఆయన పేరుతో తనను బెదిరించినట్లు చెప్పారు. వ్యాపారి హనుమాన్ ప్రసాద్ ఫిర్యాదు పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించలేదు.