Begin typing your search above and press return to search.
జగన్ సర్కార్ ని ముంచేసిదీ...దించేసేదీ...?
By: Tupaki Desk | 10 Oct 2021 9:40 AM GMTవైసీపీకి 2019 లో వచ్చిన బంపర్ మెజారిటీని చూసిన వారు అంతా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద అతి పెద్ద అంచనాలే వేశారు. జగన్ ఏపీకి కనీసం రెండు మూడు టెర్ములు తిరుగులేని విధంగా సీఎం గా ఉంటారని భావించారు. జగన్ తరచూ చెప్పే మాట కూడా ఒకటి ఉంది. తాను ముప్పయ్యేళ్ళు సీఎం గా ఉంటాను అని. అదే నిజమని ప్రత్యర్ధి పార్టీలు కూడా నాడు నమ్మాల్సిన సీన్ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆ పార్టీ దుకాణం మూసుకోవాల్సిందే అని కూడా నాడు గట్టిగానే జోస్యాలు వినిపించాయి. కానీ సాఫీగా తొలి ఏడాది ముగుస్తుంది అనగానే కరోనా మహమ్మారి వచ్చి పడింది. అది యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టిన సమస్య అయినా కూడా ఏపీ లాంటి అన్ని విధాలుగా వట్టిపోయిన రాష్ట్రం మీద దాని ప్రభావం అంతా ఇంతా కాదు. ఇలా రెండేళ్ళుగా ఏపీ సర్కార్ పడుతున్న కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఇక్కడ విషాదం ఏంటి అంటే సాయం అడుగుదామన్నా కూడా అందరికీ ఒకే రకమైన అవస్థ. పైగా కేంద్రం తీరు ఎపుడూ ఒకేలా ఉంటుంది. ఏపీకి సీఎం చంద్రబాబు అయినా జగన్ అయినా వారి వైఖరి అలాగే ఉంటుంది. దాంతో ఏపీకి వచ్చే నిధులు లేక దొరికే సాయం కానరాక అన్ని రకాలుగా వైసీపీ సర్కార్ ఇబ్బంది పడుతోంది. ఈ నేపధ్యంలో చేసిన అప్పులు పెరిగి ఏపీని అతి పెద్ద ఊబిలో పడేస్తున్నాయి. అప్పు కోసం అప్పు, తప్పలేని అప్పు, వడ్డీ కట్టడానికి అప్పు ఇలా మొత్తం రుణ చట్రంతో తిరుగుతూ ఏపీ సర్కార్ తెగ సతమతమవుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పుకోవాలి అంటే ఏపీ దివాళా తీసిన రాష్ట్రం. దానికి ఆయన చదివి వినిపించిన గణాంకాలు సాక్షిగా ఉన్నాయి. ఏపీకి ఆరులక్ష కోట్లు అప్పులు ఉంటే ఏడాదికి 42వేల కోట్ల వడ్డీ కట్టాలి. ఇంకా రెండున్నరేళ్ల పాలన మిగిలే ఉంది.
మరి దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రకాలుగా లక్షల కోట్లు అప్పులు చేయాలో, ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టాలో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. దీంతో ఏపీ ఆర్ధిక స్థితిని చూసిన వారికి భయమే కలుగుతోంది. కరోనా ప్రభావం తో ప్రపంచం తిరిగి మామూలు పరిస్థితికి రావాలంటే కచ్చితంగా పదేళ్ళు పడుతుంది అంటున్నారు. అదే దేశంలోని ఇతర రాష్ట్రాలకూ వర్తిస్తుంది. కానీ ఏపీ సాధారణ స్థితికి రావాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది అన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.
కొత్తగా పైసా ఆదాయం రాదు, సంపద ఎక్కడా లేదు, పరిశ్రమలు లేవు, కానీ ఖర్చులు ఆగవు. మరో వైపు జగన్ ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద అవగాహన ఉండి కూడా విపక్ష నేతగా జనాలకు ఇచ్చిన హామీలే ఇపుడు మెడకు చుట్టుకున్నయని అంటున్నారు. ఆ హామీలను నెరవేర్చడానికి సంక్షేమ పధకాలను అమలు చేయడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అదే టైమ్ లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పించన్లు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వానికి రధ చక్రాలు అయిన ఉద్యోగులకు ఇవ్వాలసిన పీయార్సీ, డీఏలు, ఇతర రాయితీలు కూడా ఇవ్వలేని వాతావరణం ఉంది. ఇంకో వైపు ఏపీలో రోడ్లు సహా అన్నీ కుంటుబడ్డాయి. అభివృద్ధి అన్నది లేదు. కాంట్రాక్టర్లకు చంద్రబాబు జమానాలో పాతిక వేల కోట్లు బకాయి ఉంటే ఇపుడు అది డెబ్బయి వేల కోట్లకు పేరుకుపోయింది.
ఇలా ఎక్కడ చూసినా ఇవ్వాల్సిన మొత్తాలే వేల కోట్లు ఉన్నాయి. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల తాకట్టు అన్నది పరువు తీసే వ్యవహారమే. ఈ అప్పు చేసి పప్పు కూడు కధలో జగన్ ఎక్కడ జారి పడతారో అని విపక్షాలు ఆశగా చూస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం మీద ఇంప్రెషన్ కూడా జనాల్లో మారిపోవడానికి ఇవే కారణం అవుతాయని అంటున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ ని దించేయడానికి ముంచేయడానికి విపక్షాలు భారీ ప్లాన్స్ ఏవీ వేయాల్సిన అవసరం లేదని, ఆర్ధిక సునామీలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. ఆర్ధిక మేధావుల నుంచి ఒక మాట ఉంది. అదేంటి అంటే ఏదైనా అద్భుతం జరిగి అల్లా ఉద్దీన్ అధ్బుత దీపం ఏపీ పాలకులకు దొరికితే తప్ప ఈ సర్కార్ ఊబి నుంచి బయట పడడం కష్టమని. అదే నిజమైతే జగన్ని చూసి బాధపడాలో, జాలిపడాలో తెలియదు అన్నదే వైసీపీ అభిమానుల ఆవేదనగా ఉందిట.