Begin typing your search above and press return to search.
డీజీపీనే బెదిరిస్తారా? మంత్రి వెల్లంపల్లి ఫైర్
By: Tupaki Desk | 17 Jan 2021 6:06 PM ISTఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీలో విగ్రహాల ధ్వంసం వెనుక బీజేపీ, టీడీపీ నేతలు ఉన్నారని ఇటీవల డీజీపీ గౌతం సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డీజీపీకి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సంచలన లేఖ రాశారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు ఉంటే బయటపెట్టాలని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా వారికి తప్పుడు సమాచారం చేరవేసేలా ప్రకటనలు జారీ చేయడం సరికాదని సోము వీర్రాజు హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త ప్రమేయం ఆలయాలపై దాడుల్లో లేదని లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేశారు. దాడులపై ప్రశ్నించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు నెపాన్ని నెట్టి తప్పించుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సమస్యను లేవనెత్తితే వారే విధ్వంసానికి పాల్పడినట్టు కాదని హితవు పలికారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. డీజీపీని బెదిరించే విధంగా సోము వీర్రాజు లేఖ రాశారని.. అధికారులను, ప్రభుత్వాన్ని బెదిరించాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే టీడీపీ, బీజేపీలు ఈ కుట్ర పన్నుతున్నాయని పేర్కొన్నారు.
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించామని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దమ్ముంటే నిజాలు నిగ్గుతేల్చవచ్చు కదా అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. నాలుగు నెలలు అయినా ఇప్పటివరకు దోషులను ఎందుకు పట్టుకోలేదని సోము వీర్రాజును మంత్రి వెల్లంపల్లి నిలదీశారు.
పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నప్పుడే బీజేపీ పార్టీ నేతలు హిందూ మతాన్ని మంట కలిపేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు.