Begin typing your search above and press return to search.

మోడీ, యోగీల హత్యకు టెర్రరిస్టుల కుట్ర

By:  Tupaki Desk   |   25 April 2017 12:31 PM IST
మోడీ, యోగీల హత్యకు టెర్రరిస్టుల కుట్ర
X
ఎప్పటినుంచో టెర్రరిస్టులకు టార్గెట్ గా ఉన్న ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా ప్రధాన టార్గెట్ అయ్యారు. వారిద్దరినీ హతమార్చేందుకు కాశ్మీర్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మోదీ - యోగి హత్యకు లండన్‌ లో పథకం వేసిన ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి యూపీ, ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారెక్కడ ఉన్నదీ తెలియనప్పటికీ ఉగ్రముప్పు సమాచారాన్ని ప్రధాని మోదీ - సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లకు రక్షణ కల్పించే అధికారులకు చేరవేశారు.

ముంబైలోని ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా మోడీ, యోగిలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు సమాచారం అందింది. వీరిద్దరిపై దాడిచేసేందుకు రాయ్‌ గఢ్‌ లో కొందరు రహస్య మంతనాలు జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియడంతో అప్రమత్యమయ్యారు. దీంతో వారిని పట్టుకునేందుకు మహారాష్ట్రలోని సీనియర్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో గతవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేంద్రహోంశాఖ యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ కు ఎన్ ఎస్‌ జీ కమాండో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకున్న జడ్‌ ప్లస్ భద్రతకు ఇది అదనం. కరడుగట్టిన హిందూవాదిగా ముద్రపడిన యోగి పట్ల వేర్పాటువాదుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/