Begin typing your search above and press return to search.

ట్యాంక్ బండ్ లో దూకితే బయటకి తీయడం కష్టమట !

By:  Tupaki Desk   |   28 Aug 2020 11:30 PM GMT
ట్యాంక్ బండ్ లో  దూకితే బయటకి తీయడం కష్టమట !
X
హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధమైన ప్రదేశాలలో హుస్సేన్‌ సాగర్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హుస్సేన్‌ సాగర్ మద్యలో ఉన్న బుద్ధుడిని చూడటానికి నిత్యం చాలామంది వస్తుంటారు. అలాగే ట్యాంక్ బండ్ పై నుండి నిత్యం కొన్ని వేలమంది ప్రయాణం సాగిస్తుంటారు. అలాగే ఇక ఈ జీవితం నాకు వద్దు అనుకోని హుస్సేన్‌ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకునే వారు కూడా ఎక్కువే. నెలలో దాదాపుగా 15 నుండి 20 మంది వరకు హుస్సేన్‌ సాగర్ లో దూకి ఆత్మహత్య కి పాల్పడుతుంటారు. అయితే , ఆలా హుస్సేన్‌ సాగర్ లో దూకే వారిని లేక్‌ పోలీసులు అతి కష్టం మీద కాపాడుతుంటారు.

అయితే, ఈ మధ్య ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్ ‌సాగర్‌ లో దూకేవారంతా నీటి లోపల నాచులోనూ, నిమజ్జన విగ్రహాల పీచులోనూ చిక్కుకుంటున్నారు. దూకగానే లోపలికి పోవడం తప్ప.. బయటకు వచ్చే పరిస్థితి లేదు. దూకిన వారిని రక్షించేందుకు ప్రయత్నించే పోలీసులకు సైతం వారిని బయటకు తీయడం కష్టంగా మారుతోందట. ట్యాంక్ ‌బండ్‌ కిందిభాగం వైపు ఏపుగా పిచ్చిమొక్కలు పెరగడంతో దూకేవారిని పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. దీంతో హుస్సేన్ ‌సాగర్‌లో ట్యాంక్‌ బండ్‌ వైపు గల నాచును, పిచ్చి మొక్కలను, చెట్లకొమ్మలను తొలగించే చర్యలు హెచ్‌ఎండీఏలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ పరిధిలో గల సెక్యూరిటీ సిబ్బంది చేపట్టారు.

హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యాయత్నం చేసేవారిని రక్షించేందుకు లేక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌ సాగర్‌ వెంట అక్కడక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆత్మహత్యాయత్నం చేసేవారి కదలికలను గుర్తించి వారిపై ఓ కన్నేస్తారు. వెను వెంటనే హుస్సేన్‌ సాగర్ ‌లో దూకగానే పోలీసులు గజ ఈతగాళ్లతో రక్షిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ వెంట తలెత్తుతున్న సమస్యలపై ఇటీవల లేక్‌ పోలీసులు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ దృష్టికి తెచ్చారు. దాంతో ఎన్‌టీఆర్‌గార్డెన్‌, లుంబినీపార్కు, సంజీవయ్యపార్కులో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వారిని నాచు, పీచు తొలగింపుతో పాటు చెట్ల కొమ్మలను, పిచ్చికొమ్మలను తొలగించేందుకు వినియోగించారు. రెండు రోజులపాటు 40మంది సెక్యూరిటీ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి ఆ పీచును తొలగించారు.