Begin typing your search above and press return to search.
అమ్మకానికి ఆ రెండు బ్యాంకులు.. కొనేవారున్నారా?
By: Tupaki Desk | 8 Jun 2021 12:30 PM GMTప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వరంగంలో ఉన్న రెండు బ్యాంకుల్ని అమ్మకానికి పెట్టేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వం చేతిలో ఉన్న బ్యాంకుల్ని ప్రైవేటుకు అప్పజెప్పేసేందుకు వీలుగా మోడీ సర్కారు బడ్జెట్ లోనే ఈ విషయాన్ని చెప్పేసింది. దీనికి తగ్గట్లే.. అమ్మకానికి పెట్టే అవకాశం ఉన్న బ్యాంకుల జాబితాను తీస్తే అందులో ఆరింటిని అమ్మొచ్చని నిర్ణయించారు.
అమ్మకానికి పెట్టదగిన బ్యాంకుల్ని నీతి ఆయోగ్ తన అధ్యయనంలో డిసైడ్ చేసింది. ఆ బ్యాంకులు ఏవంటే..
1. సెంట్రల్ బ్యాంక్
2. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ (ఐఓబీ)
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
5. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
6. యూకో బ్యాంక్
నీతిఆయోగ్ ఆరు బ్యాంకుల్ని సిద్ధం చేసినా.. వాటిలో అమ్మకానికి ఆకర్షించే సత్తా ఉన్నవి రెండు మాత్రమే. అవి.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఐఓబీనే అని చెబుతున్నారు. ఈ బ్యాంకుల్ని అమ్మకానికి పెట్టొచ్చని కేంద్రానికి సిఫార్సు చేశారు. వీటి నికర విలువ రూ.44వేల కోట్లుగా నిర్ణయించారు.
అమ్మకానికి ఏ బ్యాంకులన్నది లెక్క తేలిన నేపథ్యంలో తర్వాతి అడుగు ఏమిటన్నది చూస్తే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపి.. అందుకు తగ్గట్లు కొన్ని చట్టసవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు బ్యాంకుల్ని ఇప్పటికిప్పుడు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారా? అంటే సందేహమేనని చెబుతున్నారు.
కరోనా పుణ్యమా అని అంత తేలిగ్గా డీల్ సెట్ కాదంటున్నారు. మరోవైపు ఈ అమ్మకంపై బ్యాంకు ఉద్యోగ.. కార్మిక సంఘాల నుంచి భారీ ప్రతిఘటన ఎదురు కావొచ్చన్న మాట వినిపిస్తోంది. పనితీరు అంతంత మాత్రంగా ఉన్న ఈ బ్యాంకుల్ని కొనుగోలు చేసేందుకు అంత తేలిగ్గా ముందుకు వచ్చే అవకాశం లేదంటున్నారు.దీనికి తోడు బ్యాంకుల నికర విలువ కూడా భారీగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు వెంటనే ముందుకు వచ్చే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.