Begin typing your search above and press return to search.

ఆ మూడు కరోనా వ్యాక్సిన్లు ఇమ్యూనిటీని పెంచాయట!

By:  Tupaki Desk   |   24 July 2020 7:00 AM GMT
ఆ మూడు కరోనా వ్యాక్సిన్లు ఇమ్యూనిటీని పెంచాయట!
X
కరోనా వైరస్ మహమ్మారి .. ప్రస్తుతం ప్రపంచంలో రోజురోజుకి మరింత వేగంగా విజృభిస్తుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 50 లక్షల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి, ఆరు లక్షల మందికి పైగా చనిపోయారు. ఇక మనదేశంలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 12 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ కరోనాకి వ్యాక్సిన్ కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ ను కూడా పూర్తి చేసుకుంటున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో చాలామంది ప్రాధమిక భద్రతా పరీక్షలలో పాస్ అయ్యారు. వైరస్ నుంచి రక్షించే రోగనిరోధక యాంటీబాడీలను శరీరంలో తయారయ్యాయి.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్‌లో స్వచ్ఛంద సేవకులకు ఇచ్చారు. శరీరంలోని కణాలలోకి ప్రవేశించడానికి వైరస్ ఉపయోగించే ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీలు వారిలో తయారైనట్టు గుర్తించారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అస్ట్రాజెనెకాతో కలిసి పనిచేసిన పరిశోధకులు.. జూలై 20 లాన్సెట్‌లో ఈ రిపోర్టును నివేదించారు. కణాలలోకి వైరల్ ప్రవేశాన్ని యాంటీ బాడీస్ స్థాయిలు నిరోధించగలవని రుజువు చేశారు. వాలంటీర్లలో ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత acetaminophen తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపారు. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి ముఖ్యమైన రోగనిరోధక టి కణాలను కూడా ఉత్పత్తి చేసినట్టు పరిశోధకులు నిర్ధారించారు.

జర్మన్ బయోటెక్ కంపెనీ బయోఎంటెక్‌తో కలిసి పనిచేస్తున్న గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ Pfizer కూడా జూలై 20న జర్మనీలో 60 మంది క్లినికల్ ట్రయల్ medRxiv.org లో ప్రాథమిక ఫలితాలను నివేదించింది. టీకాపై మునుపటి అమెరికా అధ్యయనం కంపెనీలు వ్యాక్సిన్ రెండు మోతాదులు సురక్షితమని తేల్చేశారు. CanSino, Pfizer రెండూ వ్యాక్సిన్లపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాయని చెప్పారు. ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ తమ వ్యాక్సిన్ 2 బిలియన్ మోతాదులను అందించడానికి కట్టుబడి ఉన్నాయి. మొత్తంమీద, టీకా గ్రూపులో యాంటీ బాడీల స్థాయిలు కరోనా నుంచి కోలుకున్న రోగులలో కనిపించే స్థాయిలకు సమానమైనవని తేలింది.