Begin typing your search above and press return to search.
జ్ఞాపక శక్తి పెంచడం కోసం స్టూడెంట్స్ కి ఆ ఇంజెక్షన్లు... ట్యూటర్ అరెస్ట్ !
By: Tupaki Desk | 15 Feb 2021 2:30 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సెలైన్ సొల్యూషన్ ఇంజెక్షన్ ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని, విద్యార్థులకు ఆ ఇంజెక్షన్ ఇస్తున్న ఓ ట్యూటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈస్ట్ ఢిల్లీలోని మందవల్లి పోలీస్ స్టేషన్ జరిధిలో నివాసముండే సందీప్ అనే బీఏ విద్యార్థి ఆరో తరగతి నుంచి 9 తరగతి వరకూ ట్యూషన్లు చెప్తున్నాడు.
అతని వద్ద ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థులకు ఇటీవల అతను ఏవో ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు విద్యార్థు తల్లిదండ్రులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. జ్ఞాపక శక్తి పెరిగేందుకు విద్యార్థులకు సెలైన్ సొల్యూషన్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు విచారణలో సందీప్ విచారణలో వెల్లడించాడు. యూట్యూబ్‌లో చూసి ఈ విషయం తెలుసుకున్నానని, ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పాడు. సందీప్‌పై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇంజెక్షన్లు తీసుకున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.