Begin typing your search above and press return to search.

ఆ రైతులు ఇంట్లో ఉన్నా చ‌స్తారుః నోరు పారేసుకున్న మంత్రి.. ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన హీరోయిన్‌!

By:  Tupaki Desk   |   15 Feb 2021 10:00 PM IST
ఆ రైతులు ఇంట్లో ఉన్నా చ‌స్తారుః నోరు పారేసుకున్న మంత్రి.. ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన హీరోయిన్‌!
X
మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళ‌న‌పై.. కేంద్రంలోని పెద్ద‌ల‌తోపాటు బీజేపీ నేత‌లు, ఇత‌రులు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు ఉగ్ర‌వాదులతో కూడా పోల్చారు. తాజాగా.. హ‌ర్యానా రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కూడా నోరు పారేసుకున్నారు. ఇప్ప‌టి వ‌రకూ ఆందోళ‌న‌లో చ‌నిపోయిన రైతుల‌ను తూల‌నాడారు. దీంతో హీరోయిన్ తాప్సీ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతు నిర‌స‌న‌ల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల గురించి హ‌రియాణా వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి జేపీ ద‌లాల్ మాట్లాడుతూ.. '' వాళ్లు ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా? కొన్ని లక్షల మంది జనాభాలో 200 మంది చనిపోరా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే చనిపోయారు'' అని మంత్రి ద‌లాల్ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాప్సీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.

''మనిషి జీవితానికి విలువ పోయింది. మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికీ విలువ పోయింది. అన్నదాతల మరణాలను అపహాస్యం చేస్తున్నారు'' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తాప్సీకి పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా మద్దతు పలికారు. హర్యానా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను అన్న మాట‌ల‌పై ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో దిగొచ్చిన మంత్రి దలాల్‌ క్షమాపణలు చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నతమైన బాధ్య‌తల్లో ఉన్నవారు ఇలా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.