Begin typing your search above and press return to search.
ఆ గ్రామంలో 45 ఏళ్లు సర్పంచ్‌గా ఒకే కుటుంబసభ్యులు
By: Tupaki Desk | 13 Feb 2021 2:00 PM ISTరాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం. ఒక్కసారి పదవిలోకి వస్తే చాలనుకుంటారు. ఎందుకంటే మరోసారి దక్కుతుందనే భరోసా ఎవరికీ ఉండదు. అలాంటిది ఓ కుటుంబం 45 ఏళ్లు ఓ గ్రామాన్నిపాలిస్తూనే ఉంది. కేవలం పదవే కాదు అందుకు తగిన గౌరవాన్ని కూడా పొందింది. ఇంతకీ ఆ ఊరేంటి నాలుగు దశాబ్దాలు పాలించిన ఆ కుటుంబం చరిత్ర ఏంటి? ఒకటి, రెండు కాదు ఏకంగా 45 ఏళ్లు ఓ కుటుంబం సర్పంచిగా ఏలుబడి సాగించింది. నిస్వార్థ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ కుటుంబసభ్యులు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావిస్తే ప్రజాదరణకు లోటు ఉండదని నిరూపించింది.
వివరాల్లోకి వెళ్తే ... విశాఖపట్నం , పరవాడ మేజర్ పంచాయతీ పరవాడ సర్పంచ్ పదవిని పైలా కుటుంబీకులే 45 ఏళ్లు పాటు చేపడుతున్నారు . తొలిసారి 1958లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పైలా అప్పారావును సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1965 వరకు ఆయనే సర్పంచ్ గా కొనసాగారు. ఆయన మరణాంతరం అతని కుమారుడు పైలా అప్పలనాయుడు 1983 వరకు సర్పంచ్‌గా 18 ఏళ్ల పాటు సేవలందించారు. అనంతరం 1983 నుంచి 1988 వరకు అప్పలనాయుడు తల్లి నారాయణమ్మ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
2001 నుంచి 2006 వరకు కోడలు పైలా ఉమాదేవి, 2006 నుంచి 2013 వరకు మనుమడు పైలా అప్పారావు సర్పంచ్ గా సేవలు అందించారు. అలాగే ఇదే కుటుంంబం నుంచి 2006, 2014 ఎన్నికల్లో పైలా శ్రీనివాసరావు పరవాడ ఎంపీటీసీ సభ్యునిగా విజయం సాధించారు. 1995 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పైలా అప్పలనాయుడు జడ్పీటీసీగా, సతీమణి పైలా జయలక్ష్మి ఎంపీపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మొత్తం మీద పైలా కుటుంబీకులు 45 ఏళ్ల పాటు సర్పంచ్‌లుగా సేవలందించారు. పరవాడ అభివృద్ధిలో తమ వంతు కృషి చేశారు.