Begin typing your search above and press return to search.
ఆనాటి చీకటి రోజులను ఎన్నటికీ మరువలేం : పీఎం మోదీ
By: Tupaki Desk | 25 Jun 2021 5:00 PM ISTదేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను ఎప్పటికి మరువలేము అంటూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేం. వ్యవస్థలను పద్ధతి ప్రకారం ఏ విధంగా నాశనం చేశారో 1975 నుంచి 1977 మధ్య కాలమే చెబుతుంది. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవనం సాగిద్దాం అని ట్విట్ చేశారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటుపడిన ప్రతిఒక్క వీరుడిని గుర్తు చేసుకోవాలన్నారు.
అసలేమైందంటే...1975 జూన్ 25 అర్థరాత్రి కావడానికి 15 నిమిషాల ముందు దేశంలో చీకటి రోజులకు అంకురార్పణ జరిగింది. తనను ప్రశ్నిస్తున్నారన్న కారణంతో నాటి ప్రధానమంత్రి ఇందిర ఒక్క కలం పోటుతో దేశంలో ఎమర్జెన్సీని అమల్లోకి తీసుకువచ్చారు. భరత జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేశారు. తనకు వ్యతిరేకంగా నిలిచిన వారందరినీ జైళ్లల్లో పెట్టారు. పత్రికలపై ఆంక్షలు, అలా 676 రోజులు దేశంలో ప్రజాస్వామ్యం చీకటిలో మగ్గిపోయింది. దేశంలో ఎమెర్జెన్సీ ఇందిర విధించడానికి గల కారణాలు సంక్షిప్తంగా రాయ్ బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారు. ఇందిర ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగన్ మోహన్ సిన్హా తీర్పు వెలువరించారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1975 జూన్ 25న జస్టిస్ కృష్ణ అయ్యర్ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రధానమంత్రి పదవిలో ఇందిర ఉండవచ్చు. కానీ ఎంపీగా కొనసాగరాదు. పార్లమెంట్లో మాట్లాడే అవకాశమున్నా, ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తుది తీర్పు ఇందిరకు వ్యతిరేకంగా ఉంటుందన్న అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. అదే అభిప్రాయానికి ఇందిర కూడా వచ్చారు. దీంతో నాటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 రాత్రి 11.45 నిమిషాలకు ఎమెర్జీన్సీ విధింపజేశారు. ఇది 1977 మార్చి 21 వరకూ కొనసాగింది.