Begin typing your search above and press return to search.
ఆ దేశాలు బైడెన్ కు ఇప్పుడే విషెస్ చెప్పవట!
By: Tupaki Desk | 10 Nov 2020 9:15 AM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక కొలిక్కి రావటం.. బైడెన్ విజయం సాధించినట్లుగా తేలటం తెలిసిందే. పెద్ద ఎత్తున సంబరాలు సాగటంతో పాటు.. ఆయన విజయంపై ఇప్పటికే పలు విశ్లేషణలు వెల్లడయ్యాయి. బైడెన్ ను కాబోయే అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన అధినేతలు శుభాకాంక్షలు తెలియజేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ కు విషెస్ చెప్పని దేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?
నిజమే.. బైడెన్ కు ఇప్పటికి విషెస్ చెప్పని దేశాల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి చైనా అయితే.. మరొకటి రష్యా. ఈ రెండు దేశాల.. అధికారిక ప్రకటన వెలువడే వరకు తాము బైడెన్ కు శుభాకాంక్షలు చెప్పవని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా చట్టాలు.. నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు స్పష్టమైన తర్వాతే.. తాము స్పందిస్తామని వెల్లడించాయి.
ఎన్నికపై ట్రంప్ న్యాయవివాదాన్ని తెర మీదకు తీసుకురావటం.. ఇప్పటికి ఆయన బైడెన్ గెలిచినట్లుగా అంగీకరించకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన రష్యా.. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడే వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందించరని ఒక ప్రకటనలో పేర్కొంది. బైడెన్ కు శుభాకాంక్షలు తెలుపని దేశాల్లో చైనా కూడా ఉంది.
బైడెన్ కు శుభాకాంక్షలు తెలుపని దేశాల వరుసలో మరిన్ని దేశాలు ఉన్నాయి. వారంతా తాము అంతర్జాతీయ సంప్రదాయాల్ని పాటిస్తామని పేర్కొంటోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయా దేశాలు బైడెన్ ఎన్నికను గుర్తించనప్పటికీ.. అక్కడి మీడియా మాత్రం.. ఆయన్ను అధ్యక్షుడిగా పేర్కొంటూ పలు కథనాలు రాస్తున్నాయి. బైడెన్ కు విషెస్ చెప్పని దేశాల జాబితాలో బ్రెజిల్.. టర్కీ.. మెక్సికో తదిరత దేశాలు ఉన్నట్లు చెబుతున్నారు.