Begin typing your search above and press return to search.
మోడీతో భేటీకి ఆ సీఎంలు దూరం.. కేసీఆర్ మాత్రం?
By: Tupaki Desk | 24 Nov 2020 12:45 PM ISTదేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. ప్రధాని మోడీపై సూటి విమర్శలు చేయటమే కాదు.. జాతీయ స్థాయిలో పలు అంశాల్నిప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. మోడీ సర్కారు పెద్ద ఎత్తున తప్పులు చేస్తుందని.. రానున్న రోజుల్లో తాను చేసే పనులు అందరూ చూస్తారని చెబుతున్న కేసీఆర్.. మోడీ సర్కారు విధానాలపై సంధిస్తున్న ప్రశ్నలు.. లేవనెత్తున్న సందేహాలు కొత్త ఆసక్తి వ్యక్తమయ్యేలా ఉన్నాయి.
ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా.. సూటిగా మోడీ విధానాల్ని తీవ్రస్థాయిలో తప్పు పడుతున్న వేళలో.. ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దతతో పాటు సెకండ్ వేవ్ ను ఎదుర్కొనే అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ వీడియో కాన్ఫరెన్సును నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలు తప్పించి మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరువుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కావటం లేదు. దీనికి కారణం.. కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానితో భేటీకి మించిన అత్యవసరమైన పనులు ఏమీ లేకున్నా.. వీరిద్దరు కోవిడ్ కేసుల పేరుతో దూరంగా ఉండటం గమనార్హం. అదే సమయంలో.. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం ఈ సమీక్షా సమావేశానికి హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.