Begin typing your search above and press return to search.

అమిత్ షా పై ఆ సీఎం సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:21 AM IST
అమిత్ షా పై ఆ సీఎం సంచలన వ్యాఖ్యలు
X
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇప్పటికే ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చిన ఘనత ఉన్న బీజేపీ.. తాజాగా మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాను చూడటానికి తాను సిగ్గు పడుతున్నట్లుగా చెప్పారు.

రాజస్థాన్ ప్రభుత్వాన్నికూల్చటానికి వారు ప్రయత్నించారంటూ.. అమిత్ షా పై విమర్శనాస్త్రాల్ని సంధించారు. ‘మా ప్రభుత్వాన్ని కూల్చటానికి అమిత్ షా.. ధర్మేంద్ర ప్రధాన్ లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఐదు ప్రభుత్వాల్ని కూల్చామని.. ఆ నేతలు తమ సమావేశంలో మాట్లాకున్నారు’ అని సీఎం గెహ్లాట్ ఆరోపించారు.

అయితే..రాజస్థాన్ సీఎం చేసిన సంచలన ఆరోపణలపై బీజేపీ స్పందించింది. అందులో నిజం లేదని ఖండించింది. తమ మీద విమర్శలు.. ఆరోపణలు చేసే బదులుగా.. సొంత పార్టీలో పరిస్థితిని సరిదిద్దుకోవాలంటూ బీజేపీ మండిపడుతోంది. సిరోహి జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జులైనలో గెహ్లాట్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయటం.. అనంతరం ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్ర హోం మంత్రి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణ ఇప్పుడు పెను సంచలనంగా మారింది.