Begin typing your search above and press return to search.
నువ్వు ఎవరు? రజనీకాంత్ కు సూటి ప్రశ్న
By: Tupaki Desk | 19 Jan 2019 1:55 PM ISTమొన్నటికి మొన్న టాలీవుడ్ లో బాలకృష్ణ ఎవరోతనకు తెలియదంటూ నాగబాబు స్టేట్ మెంట్ ఇస్తే ఎంత దుమారం చెలరేగిందో అందరం చూశాం. దీనికి రిటార్ట్ గా పవన్ ఎవరో తమకు తెలియదంటూ శ్రీరెడ్డి లాంటి వాళ్లు కామెంట్స్ చేశారు. అంతకంటే ముందు పవన్ ఎవరో తనకు తెలియదంటూ ఈ వార్ స్టార్ట్ చేసింది బాలయ్య.
సరే.. ఈ సంగతి పక్కన పెడితే.. దాదాపు ఇలాంటి పోలికలతోనే తమిళనాట మరో వివాదం చోటు చేసుకుంది. నువ్వు ఎవరు అంటూ ఏకంగా సూపర్ స్టార్ నే ఓ స్టూడెంట్ లీడర్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కొన్నాళ్లుగా తమిళనాడులోని తూతుకూడి జిల్లాలో స్టెరైల్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నవిషయం తెలిసిందే. వీళ్లకు మద్దతుగా కమల్ హాసన్ ఇప్పటికే అక్కడ పర్యటించాడు. ఈ మధ్య రజనీ కాంత్ కూడా అక్కడ పర్యటించి బాధితులకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చాడు.
ఈ సందర్భంగా నువ్వు ఎవరు అంటూ కె.సంతోష్ రాజ్ - రజనీకాంత్ ను ప్రశ్నించి సంచలనం సృష్టించాడు. తాజాగా మరోసారి స్టెరిల్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్ట్ అయ్యాడు ఈ కుర్రాడు. 2018 మే నెలలో ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 20వేల మంది ర్యాలీ తీస్తే - వాళ్లపై మఫ్టీలో ఉన్న పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 13 మంది అక్కడికక్కడే మరణించారు.