Begin typing your search above and press return to search.

అతిథి లేకుండానే ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు ... చరిత్రలో నాలుగోసారి మాత్రమే !

By:  Tupaki Desk   |   6 Jan 2021 4:50 PM IST
అతిథి లేకుండానే ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు ... చరిత్రలో నాలుగోసారి మాత్రమే !
X
గణతంత్ర దినోత్సవం .. భారతదేశ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజు. ఆ రోజుకి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే , ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకి అతిదులని పిలవడం ఓ ఆనవాయితిగా వస్తుంది. అయితే , ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ అతిథి రావడంలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‌ను ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే యూకేలో కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో ఆయన భారత పర్యటన రద్దు చేసుకున్నారు. జాన్సన్ మంగళవారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారని, యూకేలో కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో రాలేకపోతున్నట్లు చెప్పారని యూకే అధికారి వెల్లడించారు.

భారత గణతంత్ర వేడుకలు అతిథి లేకుండానే జరగడం ఇది నాలుగోసారి. గతంలో 1952, 53, 1966 లో జరిగింది. ఈ సంవత్సరాల్లో ముఖ్య అతిథులు లేకుండానే మన దేశం గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంది. అయితే ఒక్కోసారి ఏకంగా ఇద్దరు ముఖ్య అతిథులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1968, 1974లో భారత గణతంత్ర వేడుకలకు ఇద్దరు ముఖ్య అతిథులు హాజరయ్యారు. 2018 లో మాత్రం 10 ఆసియా దేశాలకు చెందిన వారిని గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించుకున్నాం. అంతేకాకుండా ఈసారి జరిగే గణతంత్ర వేడుకల్లో మరో ముఖ్య ఘట్టం కూడా ఆవిష్కృతం కానుంది. మన దేశ సైనికులు చేసే పరేడ్‌లో బంగ్లాదేశ్ సైనికులు కూడా పాల్గొనబోతున్నారు.