Begin typing your search above and press return to search.
ఈసారి టీ కేబినెట్ మీటింగ్ 2 గంటలే.. భారీగా నిర్ణయాలు
By: Tupaki Desk | 8 Sept 2020 1:40 PM ISTరెండు గంటల కేబినెట్ సమావేశమా? చాలా ఎక్కువ కదా? అనుకుంటున్నారా? అదంతా ఒకప్పుడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే మంత్రివర్గ సమావేశాలు ఎప్పుడైనా.. కనీసం ఐదారు గంటలు.. కొన్ని సందర్భాల్లో ఏడు గంటలకు పైనే సాగటం తెలిసిందే. గతంలో మాదిరి.. తరచూ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించటం సీఎం కేసీఆర్ కు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా నిర్వహిస్తే.. ఆ సమావేశం సుదీర్ఘంగా సాగేలా ప్లాన్ చేస్తారు.
సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రోటీన్ కు భిన్నంగా చాలా తక్కువ వ్యవధిలోనే.. ఫటాపట్ ధనాధన్ అన్న రీతిలో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవటం విశేషం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు.
సోమవారం హాట్ టాపిక్ గా మారిన గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పోస్టును రద్దు చేసేందుకు వీలుగా రూపొందించిన బిల్లు (ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020)ను మంత్రివర్గం ఆమోదించింది. పాలనా పరంగా తన మార్కు కనిపించేలా సిద్ధం చేసిన పలు బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
తాజాగా ఆమోదించిన బిల్లులతో పాటు.. ఇటీవల కాలంలో జారీ చేసిన ఆర్డినెస్సుల్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి.. అక్రమాలను రూపుమాపటంలో చేపట్టనున్న పలు అంశాలపైనా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ రికార్డుల్ని డబ్బు కోసం ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఆ పోస్టుల్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కొత్త రెవెన్యూ చట్టానికి అనుబంధంగా పురపాలక.. పంచాయితీరాజ్ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం పలు సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం పలికింది. విపత్తులు.. అత్యయిక పరిస్థితుల్లో జీతాలు.. పెన్షన్లలో కోత విధించేందుకు వీలుగా తీసుకొచ్చే బిల్లు (ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్–2002)కు ఆమోదం పలికింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సుకు సైతం ఓకే చెప్పేశారు. దీంతో వయోపరిమితి 65 ఏళ్లకు పెరగనుంది. బీసీ జాబితాలో మరో 17కులాల్ని చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇవే కాకుండా.. పలు బిల్లులకు.. ఆర్డినెస్సులకు ఓకే చెప్పేశారు. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ నిర్మాణం.. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పాలనా అనుమతులకు ఓకే చెప్పేశారు. అంతేకాదు.. కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీసు కాంప్లెక్సుల నిధుల కేటాయింపుకు ఆమోద ముద్ర వేశారు. ఈ ఏడాది ప్రజాకవి కాళోజీ నారాయణరావు అవార్డుకు శ్రీరామా చంద్రమౌళిని ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు.