Begin typing your search above and press return to search.

ఈసారి పద్మాలు వీరికే.. తెలుగు వారికి దక్కింది కొన్నే

By:  Tupaki Desk   |   26 Jan 2021 3:30 AM GMT
ఈసారి పద్మాలు వీరికే.. తెలుగు వారికి దక్కింది కొన్నే
X
గణతంత్ర దినోత్సవానికి రోజు ముందు భారత విశిష్ఠ పురస్కారాల విజేతల్ని ప్రకటించటం తెలిసిందే. ఇదే ఆనవాయితీని ఈసారి కొనసాగించారు. కాకుంటే.. కాస్త ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తర్వాత ఉత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్.. పద్మభూషన్.. పద్మశ్రీ పురస్కారాల్ని వెల్లడించారు. 2021 సంవత్సరానికి ఏడుగురికి పద్మవిభూషణ్.. పది మందికి పద్మభూషణ్ పురస్కారాన్ని.. మరో 102 మందికి పద్మశ్రీ పురస్కరాల్ని ప్రకటించారు.

గానగంధర్వుడు.. తెలుగు వారికే కాదు.. సంగీత ప్రపంచంతో అనుబంధం ఉన్న ప్రతిఒక్కరు అభిమానించి.. గౌరవించే దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారానికి ఎంపికైన మిగిలిన ఆరుగురు విషయానికి వస్తే..

1. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
2. వైద్య రంగంలో సేవలు అందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే (కర్ణాటక)
3. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి చెందిన నరీందర్ సింగ్ కపనే (అమరికా, మరణానంతరం)
4. మౌలానా వహిద్దుద్దీన్ ఖాన్ (ఢిల్లీ)
5. బీబీ లాల్ (ఢిల్లీ)
6. సుదర్శన్ సాహు (ఒడిశా)

పద్మభూషణ్ విషయానికి వస్తే మొత్తం పది మందికి కేంద్రం ప్రకటించింది. వీరిలో ఇటీవల మరణించిన ముగ్గురు కీలక నేతలు ఉండటం గమనార్హం. వీరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు.. మరొకరు మాజీ కేంద్రమంత్రి ఉన్నారు. అంతేకాదు.. లోక్ సభ మాజీ స్పీకర్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆ పది మంది ఎవరంటే..

1. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ( గుజరాత్)
2. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ (అసోం)
3. కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాసవాన్ (బిహార్)
4. లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ (మధ్యప్రదేశ్)
5. తర్లోచన్ సింగ్ (హర్యాన)
6. క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర (ఆర్ట్)
7. చంద్రశేఖర్ కంబారా (సాహిత్యం విద్య - కర్ణాటక)
8. న్రపేంద్ర మిశ్రా (సివిల్ సర్వీస్-ఉత్తర ప్రదేశ్)
9. కాల్బే సాధిక్ (అధ్యాత్మికం, ఉత్తరప్రదేశ్)
10. రజనీకాంత్ దేవిదాస్ షాఫ్ర్ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)

పద్మశ్రీ విషయానికి వస్తే.. ఈ ఏడాది 102 మందికి కేటాయించారు. అలా ఎంపిక చేసిన వారిలో ఏడుగురు క్రీడాకారులు కావటం గమనార్హం. ఈ ఏడుగురిలో ముగ్గురు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం విశేషం. మిగిలిన నలుగురు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. పద్మశ్రీ పొందిన ఏడుగురు తెలుగు ప్రముఖుల్లో పలువురికి పెద్దగా పరిచయం లేదన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించలేదన్న విమర్శ పలువురి నోట వ్యక్తమవుతోంది.