Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక మళ్లీ వాయిదా
By: Tupaki Desk | 5 Jan 2021 7:15 PM ISTకాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అది పూర్తి కానిది.. ఇటు పీసీసీ చీఫ్ ల నియామకాలు కూడా జరిగేలా లేవు.. దీంతో అధ్యక్ష పదవుల ఎంపిక వాయిదాల మీద వాయిదాలు పడడం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక ఇప్పట్లో తెగే సూచనలు కనిపించడం లేదు. ఈనెలలోనే చేపట్టాలని అందరూ అనుకున్నా దీన్ని ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు సమాచారం.
పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ రెండు రోజుల్లో భేటి అయ్యి దీనిపై చర్చించనుంది. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలని ఇటీవల సీనియర్ నేతలు కోరారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తనకు ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో సీడబ్ల్యూసీ తాజాగా భేటి అయ్యి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేయనుంది.