Begin typing your search above and press return to search.
ఈ సారి 25 వేల మెజారిటీనా.. ఆ టీడీపీ నేత లెక్కలు ఇవే..!
By: Tupaki Desk | 7 Feb 2023 8:00 PM GMTరాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు. మార్పులు సహజం. ఇవే నాయకులకు బూస్ట్ ఇస్తూ ఉంటా యి. తాజాగా టీడీపీ నేత కూడా ఈ మార్పులపైనే ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు 25 వేల ఓట్ల మెజారిటీ ఎక్కడికి పోదని ఆయన చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఆయన 25 ఓట్లతోనే పరాజయం పాలయ్యారు. కానీ, ఇప్పుడు ఈ సంఖ్య వేలకు చేరిందని.. తనను ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే.. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్.. బొండా ఉమా మహేశ్వరరావు. గత 2014లో విజయం దక్కిం చుకున్న ఈయన.. అనతి కాలంలో ఫైర్‌బ్రాండ్‌గా ఎదిగారు.
అసెంబ్లీలోనే విరుచుకుపడ్డారు. ఏకంగా.. కొడాలి నాని వంటివారిపై తీవ్ర విమర్శలు సంధించారు. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం 25 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు.
కానీ, ఇప్పుడు ఆయన మాత్రం తన గ్రాఫ్ పెరిగిందని చెబుతున్నారు. అయితే.. ఇది ఎలా అనేది చూస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వ్యతిరేకత పెరగడం.. తనకు అనుకూలమే కదా.. అని అంటున్నారు.
ఇది ఒకరకంగా మంచిదే అయినా... వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నం చేయడం లేదనే చర్చ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. కొందరు నాయకులకు.. ఆయనకు దూరం పెరిగింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుస్తారా? అనే సందేహం నిన్న మొన్నటి వరకు వినిపించింది. అయి తే.. ఇప్పుడు ఆయనే స్వయంగా నేను 25 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకుంటానని బాహాటం గానే చెబుతున్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గం వేడెక్కినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే అలెర్ట్ అయితే.. పరిస్థితి ఏంటనేది మరోప్రశ్న. ఏదేమైనా..తాను ఆశిస్తున్న మెజారిటీ దక్కించుకోవాలంటే.. కొంత కష్టపడక తప్పదనేది పరిశీలకుల మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.