Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పరిస్థితికి ఈ ఫొటో పర్ ఫెక్ట్ ఉదాహరణ
By: Tupaki Desk | 7 Nov 2020 2:20 PM ISTదేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సామాజిక, స్ఫూర్తిదాయక అంశాలపై ట్వీట్లు చేస్తూ అందరిలోనూ కనువిప్పు కలిగిస్తుంటారు. ఆయన ట్వీట్లు ఆసక్తి రేపుతుంటాయి. ఏదో ఒక అంశంపై ఆయన వైరల్ చేస్తుంటారు.
తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. మహీంద్రా స్కార్పియో వాహన యజమాని దాన్ని గొలుసుతో చెట్టుకు కట్టాడు. ఆ ఫొటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేసి ఆసక్తికర కామెంట్ చేశాడు.
ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్ర ఆ ఫొటోను షేర్ చేసి.. ‘లాక్ డౌన్ లో పరిస్థితి కూడా అలాగే ఉందనే అర్థం వచ్చేలా’ ఆయన కామెంట్ చేశాడు. దీనికి నెటిజన్లు జోరుగా స్పందించి వివిధ రకాలైన ఫన్నీ కామెంట్లు చేశారు. టెక్నాలజీ కంటే గొలుసునే బెటర్ అనుకున్నాడు ఆ ఓనర్ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘స్కార్పియో వాహనానికి అత్యాధునిక లాకింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ దాన్ని గొలుసులతో కట్టేయడమనేది యజమాని స్వాధీనతను తెలియజేస్తుంది. ఈ లాక్ డౌన్ లో నేనూ ఎలా ఉన్నాననే విషయాన్ని ఈ చిత్రం పర్ ఫెక్ట్ గా వివరిస్తుంది. ఈ వీకెండ్ లో నేను దాన్ని చేధించి బయటకు రాబోతున్నా’’ అని ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు లైక్ లు, కామెంట్లతో హోరెత్తించారు.