Begin typing your search above and press return to search.

ఈ వార్త మీకెంతో రిలీఫ్ ఇస్తుంది

By:  Tupaki Desk   |   1 July 2021 6:00 AM IST
ఈ వార్త మీకెంతో రిలీఫ్ ఇస్తుంది
X
టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అందుబాటులోకి వచ్చే సరికొత్త సాంకేతికత కొత్త సందేహాలతో పాటు.. గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. ఇవాల్టి రోజున సెల్ ఫోన్ లేని వారిని ఊహించలేని పరిస్థితి. ఒకటికి పరిమితం కాకుండా రెండేసి ఫోన్లు వాడేటోళ్లు బోలెడంత మందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. అదేమంటే.. సెల్ ఫోన్ సరిగా పని చేయాలంటే సెల్ టవర్లు చాలా కీలకం. వీటితో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని.. ఆరోగ్యం దెబ్బ తింటుందన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి.

ఇకపై.. ఇలాంటి వాదనలకు అవకాశం లేకుండా స్పష్టతను ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యునికేషన్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ హర్వేష్ భాటియా. సెల్ టవర్లు ఆరోగ్యానికి హాని చేస్తాయా? అన్న అంశంపై చేసిన అధ్యయన వివరాల్ని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సెల్ టవర్ల కారణంగా ఆరోగ్యానికి ముప్పు అన్న వాదనలో నిజం లేదని తేల్చారు. కోట్లాది మందికి ఉండే టెన్షన్ ను తీర్చేశారు. ఇంతకూ ఆయన చెప్పిన అంశాలేమిటన్నది చూస్తే..

- విద్యుతయస్కాంత క్షేత్ర సంకేతాలపై జరిపిన పరిశోధనల్లో మొబైల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఎలాంటి హానికరమైన ఆరోగ్య సమస్యల్ని కలిగిందని తేలింది

- సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ గురించి వినిపించే వాదనలన్నిఅపోహలే

- మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి హాని లేదు. ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సిగ్నలళ్లను అందించటానికి మరిన్ని టవర్ల ఏర్పాటు అవసరం ఉంది.

- సెల్ ఫోన్ టవర్ల వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు