Begin typing your search above and press return to search.
టెక్ దారుణం: నగ్నంగా చూపే యాప్
By: Tupaki Desk | 2 July 2019 10:10 AM ISTటెక్నాలజీ మనిషికి ఉపయోగపడాలి. అభివృద్ధికి తోడ్పడాలి. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీని వక్రమార్కంలో వాడితే ఎంతటి అనర్థాలో చూస్తున్నాం.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఇంట్లోంచి అన్ని పనులు చక్కబెడుతున్నాం. విరివిగా వచ్చిన యాప్ లను సద్వినియోగం చేసుకుంటూ కడుపులో చల్ల కదలకుండా ఉంటున్నాం.
టెక్నాలజీని మంచికి వాడితే అంతా బాగానే ఉంటుంది. కానీ చెడుకు వాడితేనే నష్టం. ఇప్పుడదే మన జీవితాలను రోడ్డున పడేస్తోంది. అభాసుపాలు చేస్తోంది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం యాపులతో శృంగారం శృతి మించుతోంది. టిక్ టాక్ వంటి యాప్ ల వల్ల ప్రాణాలు పోతున్నాయి. జుగుప్స పెరిగిపోయింది.
ఇప్పుడు అంతకుమించిన యాప్ వచ్చేసింది. మహిళలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఈ యాప్ ఉంది. నిండుగా దుస్తులు ధరించి , సంప్రదాయబద్దంగా ఉండే మహిళలను కూడా పూర్తి నగ్నంగా చూపించే యాప్ వచ్చేసింది. ‘డీప్ న్యూడ్’ పేరుతో కృత్రిమ మేథ సాయంతో ఈ యాప్ రూపొందించారు.
బట్టలు వేసుకొని నిండుగా ఉన్న మహిళల ఫొటోలను ఈ యాప్ లో ఓపెన్ చేస్తే వారు పూర్తి నగ్నంగా కనిపించేలా దీన్ని రూపొందించారు. ఇది పెద్ద దుమారం రేపుతోంది. దాన్ని చెడుగానే ఎక్కువగా ఉపయోగిస్తారని చాలా మంది మండిపడుతున్నారు.
కాగా ఈ యాప్ ను ఇంటర్నెట్ లో విడుదల చేయగానే 5 లక్షల మంది ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకొని వాడేశారు. తీవ్ర వివాదాస్పదం కావడంతో ఈ ‘డీప్ న్యూడ్’ యాప్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించారు. అయినా ఇది వక్రమార్గాన జనాలకు చేరువవుతూనే ఉందట..