Begin typing your search above and press return to search.

బ్రతికుండగానే విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   14 March 2020 6:00 AM GMT
బ్రతికుండగానే  విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే ..ఎందుకంటే ?
X
రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ , శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఇది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. అధికారం ఎటువైపు ఉంటే .. అటు వైపు దూకేస్తున్నారు ఇప్పుడు ఉన్న రాజకీయ నేతలు. కాసేపు ఈ విషయం పక్కన పెడితే ..రాజకీయాలలో గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకుంటే , అయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన తరువాత , అయనని మర్చిపోకూడదు అని భావించి , వారి విగ్రహాలు పెడుతుంటారు. ఇది చాలా కామన్.

కానీ , తాజాగా ఒక ఎమ్మెల్యే తనకి ప్రాణ హాని ఉందని , తాను పోయిన తరువాత , ప్రజలు తనని మర్చిపోకూడదు అని భావించి , బ్రతికుండగానే రెండు విగ్రహాలని తయారుచేయించి పెట్టుకున్నారు. అదేంటి ..బ్రతికుండగానే విగ్రహాలు తయారుచేయించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరా? అని ఆలోచిస్తున్నారా!ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే ..తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ .

సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ మూడేళ్ల క్రితం కోల్‌ కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్‌ కావడం తో ఆయన ఈ విషయం పై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని తెలిపారు.

గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్‌ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురి కావొచ్చు , అందుకే వీటిని తయారుచేయించి పెట్టాను అని తెలిపారు. అలాగే తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు మాత్రం , రాజకీయ నాయకుల నుండి ఆయనకి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్తున్నారు.