Begin typing your search above and press return to search.

శాంతి పర్వాన్ని ప్రస్తావించి చివరకు చెప్పింది ఇదే

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:34 AM GMT
శాంతి పర్వాన్ని ప్రస్తావించి చివరకు చెప్పింది ఇదే
X
అందరి జీవితాల్ని ప్రభావితం చేసే దేశ వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఎంతో కుతూహలంగా వింటారు. అర్థం కాని పదాలు మధ్య మధ్యలో వస్తున్నా.. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ.. ఆర్థిక మంత్రి మాట్లాడే బడ్జెట్ ప్రసంగం పక్కనే.. సదరు చానల్ వారు వేసే బ్రేకింగ్స్ ను చూసుకుంటూ.. చాలాఅర్థమైపోయినట్లుగా భావించేటోళ్లు కనిపిస్తుంటారు.

బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినే సామాన్యుల్లో చాలామంది ఈ ఏడాది ఆదాయపన్ను మినహాయింపు ఎంత తగ్గించారన్న విషయంపై ఏం చెబుతారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. వరాల వర్షం కురిపిస్తారని భావించినప్పటికీ.. మోడీ సర్కారు ఆ దిశగా అడుగు వేయకపోవటం కనిపిస్తుంది. ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. తాము మొదలు పెట్టిన పనిని.. తాము అనుకున్నట్లుగా పూర్తి చేయాలన్నట్లుగా మోడీ సర్కారు ఉందన్నట్లుగా నిర్మలమ్మ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుంది.

తన బడ్జెట్ ప్రసంగం మధ్యలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మహాభారతంలోని శాంతిపర్వాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. రాజు తప్పనిసరిగా ప్రజల యోగక్షేమాల కోసం పని చేయాలి.. ధర్మాన్ని అనుసరించి పరిపాలన చేయాలని మహాభారతంలోని శాంతిపర్వంలో పేర్కొన్నారన్న మాటలు విన్నంతనే భారీ వరాన్ని ప్రకటించేందుకు నిర్మలమ్మ సిద్ధమవుతున్నారని భావించారు. అయితే.. ఆమె నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నంతనే ఊసురుమనిపించేలా వ్యాఖ్యలు ఉండటం విశేషం.

శాంతిపర్వరాన్నిప్రస్తావించిన నిర్మలమ్మ చివరకు చెప్పిందేమంటే.. ఆడిషనల్ ట్యాక్స్ చెల్లింపులపై ఆప్డేటెడ్ రిటర్న్ ను దాఖలు చేసేందుకు వీలుగా ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం కల్పించారు. ఏదోఅనుకున్న వారికి మరేదో అంశాన్ని చెప్పి.. నిరాశతో నిట్టూర్చేలా చేశారు కేంద్ర విత్త మంత్రి.

అప్డేటెడ్ రిటర్న్ విషయంలో నిర్మలమ్మ ఏం చెప్పారన్నది చూస్తే.. ‘‘అడిషనల్ ట్యాక్స్ చెల్లింపులపై అప్డేటెడ్ రిటర్న్ ను దాఖలు చేసేందుకు పన్నుదారులకు అనుమతిస్తూ కొత్త నిబంధనను నేను ప్రతిపాదిస్తున్నా. ఈ అప్డేటెడ్ రిటర్న్ ను రెండేళ్ల లోపు దాఖలు చేసేందుకు వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నా. దీనివల్ల లిటిగేషన్లు తగ్గుతాయి. స్వచ్ఛందంగా ట్యాక్స్ ఫైలింగ్స్ పెరుగుతాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

నిజమే.. కేంద్ర మంత్రి నిర్మలమ్మ లిటిగేషన్లు తగ్గుతాయి. కానీ.. ఏదైనా అనుకోని ఇష్యూ ఎదురైతే.. దాని నుంచి తప్పించుకోవటానికి వీలుగా తాజాగా ఇచ్చిన వెసులుబాటు అవకాశం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనం కొందరికేనని చెప్పక తప్పదు. అది కూడా.. వారు పన్ను ఎగవేత నేరం నుంచి తప్పించుకునేందుకే వీలవుతుందన్న విమర్శ వినిపిస్తోంది. ఇదెంత వరకు నిజమన్నది మరిన్ని వివరాలు బయటకు వచ్చాక తేలనుంది.