Begin typing your search above and press return to search.

హరీష్ పోస్టుల కలకలం.. అసలు నిజం ఇదే..!

By:  Tupaki Desk   |   27 Jun 2019 4:51 AM GMT
హరీష్ పోస్టుల కలకలం.. అసలు నిజం ఇదే..!
X
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ హరీష్ రావు కనిపించకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా సానుభూతి వెల్లివిరిసింది. గడిచిన ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖ మంత్రిగా పరుగులు పెట్టించిన హరీష్ ను కేసీఆర్ కనీసం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలవలేదన్న చర్చ సాగింది. ప్రాజెక్టు కోసం పాటుపడ్డ హరీష్ రావు సిద్దిపేటలోనే యోగా చేసుకుంటూ గడపడం.. ఆ ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆ తర్వాత కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హరీష్ రావు పేరిట ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అగ్గి రాజేసింది. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎలా పాటుపడ్డది.. అక్కడ సందర్శించింది..కృషి చేసిన ఫొటోలను - వీడియోలను ‘హరీష్ రావు తన్నీరు’ పేరిట ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టులు పెట్టారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంలో హరీష్ పాత్ర ఉందనేటట్టు హరీష్ రావు ఈ ఫొటోలు- వీడియోలు పెట్టారా అన్న చర్చ తెలంగాణ అంతటా చర్చనీయాంశమైంది.

కేసీఆర్ గొప్పతనంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ పాత్ర కాదనలేనిది. ఇప్పుడు దానికి ఆధారాలుగా హరీష్ పేరిట ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫొటోలు, వీడియోలు కనిపించడం టీఆర్ ఎస్ లో దుమారం రేపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం వేళ కేసీఆర్ ఏ ఎమ్మెల్యేను , మంత్రిని తన వెంట ఉంచుకోలేదు.. పిలువలేదు. ఎమ్మెల్యేలందరినీ తమ నియోజకవర్గాల్లో కాళేశ్వరం సంబరాలు చేసుకోమన్నారు. అలా అందరూ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. హరీష్ కూడా సిద్దిపేటలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే హరీష్ ఇన్ స్టాగ్రామ్ లో కాళేశ్వరం కోసం తాను చేసిన కృషికి సంబంధించిన ఫొటోలు పెట్టడంతో టీఆర్ ఎస్ శిబిరం ఆందోళన చెందింది. దీనిపై హరీష్ రావు కార్యాలయాన్ని సంప్రదించగా.. అసలు హరీష్ కు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అనేదే లేదని తేలిందట.. హరీష్ ఆ పోస్టులు చేయలేదని.. అది ఫేక్ అకౌంట్ అని తెలిసిందట.. అలా హరీష్ రావు దుమారం టీఆర్ఎస్ లో ప్రస్తుతానికి చల్లారింది.