Begin typing your search above and press return to search.
లోకేష్ కు ఎన్నారైలు ఇచ్చిన స్ట్రాంగ్ సలహా ఇదే..!
By: Tupaki Desk | 22 Dec 2021 9:32 AM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి, విదేశాల్లో ఉన్న వారికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా.. టీడీపీకి అనుకూలంగా ఎన్నారైలు స్పందిస్తుంటారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా! గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఎన్నారైలు అనేక రూపాల్లో రాష్ట్రానికి సేవ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకే అనే విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు.. టీడీపీ సభ్యత్వాలు కూడా విదేశాల్లోనూ జరుగుతుంటాయి. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో ఎన్నారై టీడీపీ వింగ్‌లు ఉన్నాయి.
వీరు టీడీపీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ముందుంటున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పు డు.. చంద్రబాబు దీక్షకు కూర్చున్నప్పుడు... ఇటీవల చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో దూషించారనే వార్తలు వచ్చినప్పుడు.. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు..కూడా ఎన్నారై టీడీపీ నాయకులు.. రియాక్ట్ అయ్యారు. ఇలా.. టీడీపీ తో ఎన్నారైలు.. అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. అయి తే.. ఇప్పుడు వీరే.. టీడీపీ యువ నాయకుడు లోకేష్ విషయంలో చిత్రం గా స్పందిస్తున్నారు. ``లోకేష్ మీరు ప్రాధేయ పడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితి లోనూ వర్కవుట్ కాదు.. అలా చేయకండి. కొంచెమైనా.. పౌరుషం చూపించండి`` అని సలహాలు ఇస్తున్నారు.
దీనికి కారణం ఏంటి? అంటే.. తాజాగా రెండు మూడు రోజులుగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలను కలుస్తున్నారు. అదేసమయంలో రోడ్డు విస్తరణ కోసం.. పేదలు ఆక్రమించుకున్న స్థలాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న నేపథ్యంలో బాధితులను కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన.. ``ఈసారైనా నన్నుగెలిపించండి`` అనివారిని ప్రాధేయపడుతున్నారు. ఇదే ఎన్నారైలు.. తప్పుబడుతున్నారు. అలా వద్దు! అని సూచిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పౌరుషం తో ప్రజల్లోకి వెళ్లారు తప్ప.. ఆత్మ గౌరవ నినాదం వినిపించారు తప్ప.. ఇలా ఎప్పుడూ.. ప్రాధేయ పడలేదని అంటున్నారు.
అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ విషయాన్ని కూడా చెబుతున్నారు. జగన్ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా.. ప్రజల్లోనే ఉన్నారు.. వారికి తన బాధ ఎక్కడా చెప్పుకోలేదు. తను వారి బాధలు వినేందుకు రెడీగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో.. నువ్వు కూడా రాజకీయాలు.. చేయాలని ఎన్నారైలు.. లోకేష్ కు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఐటీ విభాగానికి ఈ తరహా సూచనలు సలహాలు పెద్ద ఎత్తున వస్తుండడం గమనార్హం. మరి లోకేష్ ఇప్పటికైనా.. ఇలా ఆలోచన చేస్తారా? లేదా? అనేది చూడాలి.