Begin typing your search above and press return to search.
కిట్ తయారు చేసిన ఐసీఎంఆర్.. దాన్ని దక్కించుకునే వారెవరు?
By: Tupaki Desk | 21 Dec 2021 8:12 AM ISTఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఒమిక్రాన్. కరోనా కథ దాదాపుగా కంచికి చేరినట్లేనని అందరూ భావిస్తున్న వేళ.. కథ ఇంకా చాలా ఉందన్నట్లుగా ఒమిక్రాన్ వేరియంట్ తెర మీదకు వచ్చింది. దక్షిణాఫ్రికాలో మొదలైన దీని రచ్చ ఇప్పుడు యూరప్ తో పాటు పలు దేశాల్లో కొత్త భయాల్ని కలిగించేలా చేస్తోంది. చూస్తుండగానే కేసులు అంతకంతకూ ఎక్కువ అయిపోతున్నాయి. కరోనాకు చెక్ పెట్టేస్తుందని భావించిన టీకాలకు సైతం కొరుకుడుపడనట్లుగా ప్రచారం జరుగుతున్న ఈ వేరియంట్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వటం చూస్తుండగానే.. కేసుల సంఖ్య పెరుగుతుండటం తెలిసిందే.
కరోనాను గుర్తించే కిట్లు సైతం ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించదని.. దీంతో అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారి శాంపిల్ తీసుకున్న తర్వాత జీనోమ్ సీక్వెన్స్ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా శాంపిల్ తీసుకున్న తర్వాత రిజల్ట్ రావటానికి కనీసం రెండు.. మూడు రోజులు పడుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేసింది ఐసీఎంఆర్. ఒమిక్రాన్ ను సైతం ఇట్టే కనిపెట్టేసే కొత్త తరహా కిట్ ను రూపొందించింది.
అయితే.. తాము తయారు చేసిన కిట్ల సాంకేతికతను బదిలీ చేస్తామని.. అందుకు అవసరమైన వాణిజ్య ఒప్పందాన్ని తమతో చేసుకోవాలని కోరుతోంది. రానున్నదంతా ఒమిక్రాన్ రోజులే అన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరణాలు చాలా తక్కువగా ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించటం.. చూస్తుండగానే ఈ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు వచ్చేస్తున్న వేళ.. దీన్ని గుర్తించే సింఫుల్ కిట్ కు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీంతో తాము తయారు చేసిన ఇన్ విట్రో కిట్లకు అవసరమైన సాంకేతికతను అందించేందుకు ఐసీఎంఆర్ సిద్ధమైంది. తమతో ఒప్పందం చేసుకునే వారికి కిట్ల సాంకేతికతతో పాటు ఐపీ హక్కులు.. వాణిజ్య హక్కులు ఐసీఎంఆర్ వద్దనే ఉంటాయి. కాకుంటే డీల్ కుదుర్చుకున్న వారికి మాత్రం లైసెన్సు అగ్రిమెంట్లను కుదుర్చుకొని.. అవసరమైన సాంకేతికతను బదిలీ చేస్తారు. ఈ కిట్లతో చాలా త్వరగా ఒమిక్రాన్ సోకిందా? లేదా? అన్నది తేలుతుంది. మరి.. దీన్ని ఏ సంస్థ సొంతం చేసుకుంటుందో చూడాలి.