Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోసం ఓవైసీ సృష్టించిన రికార్డు ఇదే

By:  Tupaki Desk   |   19 Oct 2019 3:43 PM GMT
కేసీఆర్ కోసం ఓవైసీ సృష్టించిన రికార్డు ఇదే
X
హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సార‌థ్యంలోని పాత‌బ‌స్తీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ ఓ ప్ర‌త్యేక రికార్డు సృష్టించింది. ఎంఐఎం చ‌రిత్ర‌లో లేని విధంగా తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ల్ల ఇప్ప‌టికే ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష హోదా సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.అలా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను `పొందిన‌`ఎంఐఎం తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు త‌న కృత‌జ్ఞ‌త‌ను తెలుపుకొన్నద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన మజ్లిస్ పార్టీ నేతలు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇవాళ్టి దాకా మద్దతు పలకలేదు. అంతేకాకుండా...తెలంగాణ బంద్‌లో కూడా పాల్గొనలేదు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అనంత‌రం తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ విజ‌య‌వంతంగా చీల్చిన సంగ‌తి తెలిసిందే. సీఎల్పీ విలీన ప్రక్రియకు స్పీకర్‌ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. 120 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి కేవలం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఏఐఎంఐఎం అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అలా కీల‌క‌మైన హోదాను పొందిన ఎంఐఎం పార్టీ తెలంగాణ‌లో మెజార్టీ వ‌ర్గాలు మ‌ద్ద‌తిస్తున్న ఆర్టీసీపై అనూహ్య‌మైన వైఖ‌రిని అవ‌లంభించింది. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష హోదాలో కేబినెట్ మంత్రి ర్యాంక్‌తో స‌మాన‌మైన గౌర‌వాన్ని ఆ పార్టీ నాయ‌కులు పొందుతుండ‌గా...కీల‌క‌మైన స‌మ్మె విష‌యంలో ఆ పార్టీ వైఖ‌రిని వెల్ల‌డించలేదు. స‌మ్మెను వ్య‌తిరేకించ‌లేదు, మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. తెలంగాణ‌లో క‌నీస ప్రాతినిధ్యం కూడా లేని జ‌న‌సేన వంటి పార్టీలు సైతం మ‌ద్దతు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వీట‌న్నింటినీ గ‌మ‌నించిన కొంద‌రు ప్రజలకు మద్దతు పలకకుండా కూడా ప్రధాన ప్రతిపక్షంగా కూడా వ్యవహరించవచ్చన్న మాట అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.