Begin typing your search above and press return to search.

బ్రిటన్ కు తరలిపోతున్న భారతీయులు: కారణం ఇదే..

By:  Tupaki Desk   |   25 Oct 2021 6:42 AM GMT
బ్రిటన్ కు తరలిపోతున్న భారతీయులు: కారణం ఇదే..
X
పెద్ద పెద్ద చదువులు పూర్తయిన తరువాత కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు చాలా ఇంట్రెస్టుచూపుతారు. స్నేహితులు, బంధువుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి వ్యాపారం, ఉద్యోగం చేసేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే మనదేశం కంటే కొన్ని దేశాల్లో భారీ జీతంతో పాటు, వ్యాపారానికి అనువైన సౌకర్యాలను కల్పిస్తాయి. అంతేకాకుండా ఇండియాతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీ రేటు ఎక్కువగా ఉండడంతో అక్కడ కొన్నేళ్ల పాటు గడిపి ఆ తరువాత స్వదేశానికి వస్తారు. ఇంకొందరు అక్కడే సెటిలయ్యేందుకు మొగ్గుచూపుతారు. అయితే కొన్ని దేశాలు వీసా విషయంలో కాస్త కఠువుగానే ఉంటాయి. మరికొన్ని దేశాలు మాత్రం విదేశీయులకు అనుగుణంగా వీసా ప్రక్రియను సెట్ చేస్తారు. తాజాగా ఇండియన్స్ ఎక్కువగా బ్రిటన్ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట. అందుకు కారణం ఏంటో చూద్దాం..

కరోనా సంక్షోభం తరువాత వివిధ దేశాల్లో ఉన్నవారు స్వదేశానికి వెళ్లారు. కొన్నిరోజులగా వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపించడంతో విదేశీ ప్రయాణాలు మొదలయ్యాయి. దీంతో విదేశాల్లోకి వెళ్లి చదువుకునేవారు, వ్యాపారం చేసేవారు ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. విదేశాలకు వెళ్లడం అంటే ఎక్కువగా అమెరికా పేరే గుర్తుకు వస్తుంది. అమెరికా, ఇండియాతో చాల సత్సంబంధాలు ఉండడంతో ఇక్కడికి వెళ్లేందుకే ఇంట్రెస్టు చూపేవారు. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది భారతీయులు ఉండడంతో వారికి సంబంధించిన వారిని ఇండియా నుంచి తీసుకొస్తున్నారు.

తాజా పరిస్థితుల ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇంగ్లాండ్ వెళ్లేందుకు ఇంట్రెస్టు చూపుతున్నారట. అయితే కరోనా వైరస్ తో ఎక్కువగా నష్టపోయింది బ్రిటన్ దేశమే. ఈ దేశ ప్రధాని బోరిస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సంక్షోభం తరువాత బ్రిటన్ వీసీ విషయంలో కొన్ని ఆఫర్స్ ప్రకటించిందట. దీంతో ఆఫర్ ను ఎక్కువగా ఇండియన్స్ ఉపయోగించుకుంటున్నారనట. ఇదే కాకుండా బ్రిటన్, ఇండియా మధ్య జరిగిన ఒప్పందంతో ఈ వలసలకు కారణం అవుతుందని అంటున్నారు.

భారత్ కు చెందిన ధనవంతులు, వ్యాపారం చేయాలనుకునేవారు, ఇప్పుడున్న వ్యాపారాలను విస్తరించాలనుకునేవారు ఎక్కువగా బ్రిటన్ వెళ్లేందుకే ఇంట్రెస్టు చూపుతున్నారట. మిగతా దేశాల కంటే ఇంగ్లండ్ తో ఇండియా కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవహారిక భాష ఉండడం, అక్కడి స్టాక్ మార్కెట్లు భారతీయులకు అందుబాటులో ఉండడం, వ్యాపర నిర్వహణ కూడా సులభంగా ఉండడంతో ఎక్కువశాతం ఇక్కడికే మొగ్గు చూపుతున్నారట. ఇవే కాకుండా బ్రిటన్లోభారత సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వారు వారి బంధువులు, స్నేహితులకు ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్య, వైద్య సదుపాయాలు అనుకూలంగా ఉండడంతో ఇండియాకు చెందిన బడా బాబులు ఇక్కడ తిష్ట వేసేందుకు వెళ్తున్నారు.

అటే బ్రిటన్ ప్రభుత్వం కూడా వీసా విషయంలో సులభతరం చేసింది. సోలో రిప్రజెంటిటేవ్ ఆఫ్ ఓవర్ సీస్ బిజినెస్ ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా భారతీయులు వ్యాపారం చేసేందుకు ఇక్కడికి వస్తున్నారు. ఈ వీసా ప్రకారం భారత్ కు చెందిన వ్యాపారులు ఇక్కడ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వ్యాపారంచేసేవారు మరొక వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. అలా నామినేట్ చేసిన వ్యక్తి భాగస్వామిని కూడా తీసుకొచ్చే వీలు కల్పించింది ప్రభుత్వం. 2 మిలియన్ ఫౌండ్లు పెట్టి ఈ వీసా ద్వారా దేశంలోని ప్రవేశించబచ్చు. టైర్ -1 వీసాతో పోలిస్తే ఇది సులభంగా ఉండడంతో వ్యాపారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బ్రిటన్లో కొత్తగా వ్యాపారం చేసేవారు సోలో రిప్రజెంటేవ్ వీసా, ఇన్వెస్టర్ వీసా, స్టార్టప్ వీసాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ శాతం ఇండియాకు చెందిన వారివే ఉన్నాయి. వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా రిస్క్ లేకపోవడంతో ఆసక్తి చూపుతున్నారు.