Begin typing your search above and press return to search.

బాబు వంశీని ఆపడానికి అసలు కారణం ఇదే

By:  Tupaki Desk   |   29 Oct 2019 5:15 AM GMT
బాబు వంశీని ఆపడానికి అసలు కారణం ఇదే
X
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తరువాత దాదాపుగా రెండేళ్ల వరకు పెద్దగా విమర్శలు , ప్రతి విమర్శలు ఉండవు. కానీ , 2019 లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ పై టీడీపీ నేతలు ..అధికారం చేపట్టిన మరుసటి రోజు నుండే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనికి ప్రధాన కారణం టీడీపీ బలమైన ప్రతిపక్షం అని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికే. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఏపీలో వలసల రాజకీయం మొదలైంది.

ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. అదే బాటలో మరికొంతమంది టీడీపీ కి చెందిన కీలక నేతలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు అధినేత కి లెటర్ పంపించారు. దీనితో వల్లభనేని వంశీని వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు అని , రాజీనామా పై మరోసారి ఆలోచించాలి అని వంశీని కోరుతూ చంద్రబాబు ..వంశీ తో మాట్లాడాల్సింది గా ఎంపీ కేశినేని నాని , మరో మాజీ ఎంపీని అయన వద్దకి పంపించారు.

వంశీని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు అని అంటే ... అందరూ వంశీ పై బాబు కి ఉన్న ప్రేమఅని అనుకుంటున్నారు. కానీ , వంశీ రాజీనామా లెటర్ పంపినా బాబు మరోసారి అలోచించి నిర్ణయం తీసుకోమనడం వెనుక కారణం ఇంకొకటి ఉంది. అది వంశీ పై ప్రేమకాదు. బాబు కి పదవిపై ఉండే వ్యామోహం. అసలు విషయం ఏమిటి అంటే ..ప్రస్తుతం టీడీపీ కి కేవలాం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే పార్టీలో 22 మంది మాత్రమే మిగులుతారు. కానీ , వంశీ రాజీనామా చేసినా తరువాత టీడీపీ కి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యే లు కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

దీనితో పార్టీలో ఉండే ఎమ్మెల్యే సంఖ్య 16 కి పడిపోతుంది. ఆలా కనుక జరిగితే ..బాబు కి ఇప్పుడున్న కాబినెట్ ర్యాంక్ , ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా పోతుంది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి కనీసం ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా పొతే అది చంద్రబాబు కి పెద్ద అవమానం జరిగినట్టే . దీనికోసం వంశీని రాజీనామా చేయకుండా ఆపాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.