Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిల పార్టీ అసలు పేరు ఇదే

By:  Tupaki Desk   |   3 July 2021 4:30 AM GMT
వైఎస్ షర్మిల పార్టీ అసలు పేరు ఇదే
X
మొత్తానికి అన్నబాటలోనే చెల్లి కూడా నడిచింది. తన పార్టీ పేరును ‘వైఎస్ఆర్’ను కలిసేలా పెట్టింది. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు.. ‘యువశక్తి రైతు రాజ్యం తెలంగాణ’ పార్టీగా నామకరణం చేసుకుంది. అన్న జగన్ కూడా ‘వైఎస్ఆర్’ పేరు కలిసేలా ‘యువజన శ్రామిక రైతు రాజ్యం’ అని పెట్టుకున్నాడు. దానికి పోలీ ఉండేలా షర్మిల పేరు పెట్టడం విశేషం.

ఇక అచ్చం వైసీపీ రంగులను పోలి ఉండేలానే నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను షర్మిల పార్టీ కలిగి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జగన్ పార్టీతో సమానంగా ఉంటుందని తేలిపోయింది.ఇక వైసీపీలాగానే షర్మిల పార్టీ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిసింది.

ఇక జులై 8న హైదరాబాద్ లోనే ఘనంగా పార్టీని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీని ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి తెలంగాణ వ్యాప్తంగా లక్షమందిని సమీకరించాలని.. పార్టీని ఘనంగా ప్రకటించాలని యోచిస్తున్నారు.

అన్న జగన్, చెల్లి షర్మిల ఇద్దరూ ప్రధానంగా యువత, రైతులను తమ పార్టీల్లో ఇనుమడించడం విశేషంగా మారింది. తెలంగాణలోనూ అన్నయ్య జగన్ తరహాలోనే ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి ముందుకెళుతున్నారు.

‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ పేరుపై ఎటువంటి అభ్యంతరం రాకపోవడంతో ఆమోదించింది. ఇక వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్న కూతురు షర్మిల పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని.. వైఎస్ఆర్ పేరును వాడుకోవచ్చని ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ భార్య విజయమ్మ నో అబ్జక్షన్ లేఖ రాశారు. దీంతో ఆమోదం లభించింది. ఇక షర్మిల రాజకీయ పార్టీలో ‘వైఎస్ఆర్’ పేరును సంక్షిప్తం చేయాలని ఈసీ సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.