Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల ఫలితాలకు ఆలస్యం ఎందుకో చెప్పే ఫోటో ఇది

By:  Tupaki Desk   |   7 Nov 2020 10:30 AM IST
అమెరికా ఎన్నికల ఫలితాలకు ఆలస్యం ఎందుకో చెప్పే ఫోటో ఇది
X
శాస్త్ర.. సాంకేతికంగా చూస్తే.. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా చెప్పే అమెరికాలో.. ఓట్ల లెక్కింపునకు ఇన్ని రోజులు పడుతుందా? అన్న సందేహం పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదైతే.. అందుకు తగ్గట్లు.. ఏర్పాట్లు చేయాల్సింది కదా? అన్న క్వశ్చన్ రాక మానదు. అయితే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి. ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణాలు ఏమన్నది చూస్తే.. పలు అంశాలు కనిపిస్తాయి.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో కరోనా నేపథ్యంలో ఈసారి పోస్టల్ ఓట్లు భారీగా నమోదయ్యాయి. దాదాపు 68 శాతం మంది ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓట్లు వేశారు. ఈ ఓట్లను లెక్కించాలంటే.. ఓటరు సంతకం.. సాక్షి సంతకాలతో పాటు.. చిరునామాల్ని కచ్ఛితంగా పరిశీలించాలి. అంతేకాదు.. ఆ సమాచారాన్ని కౌంటింగ్ మిషన్లలో పొందుపర్చటం లాంటి సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది.

దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతోంది. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో లెక్కించాల్సిన ఓట్లు సంచుల కొద్దీ ఉన్నాయని చెప్పాలి. దీనికి అద్దం పట్టేలా కొన్ని ఫోటోలుసోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. పైన పోస్టు చేసిన ఫోటో విషయానికి వస్తే.. పోమోనాలో ఇంకా లెక్కించాల్సిన పోస్టల్ ఓట్ల బ్యాలెట్లు. ఇవన్నీ లెక్కలోకి వెళ్లిన తర్వాతే తుది ఫలితం వెల్లడవుతుంది. అప్పటివరకు ఎదురుచూపులు తప్పించి మరో మార్గం లేదని చెప్పాలి.