Begin typing your search above and press return to search.

ఇన్ స్టాలో కొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘మెస్సీ’ పోస్ట్..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
ఇన్ స్టాలో కొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘మెస్సీ’ పోస్ట్..!
X
ఫుట్ బాల్ వరల్డ్ కప్-2022 ఫైనల్ తర్వాత అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఫిఫా కప్ ను ముద్దాడుతున్న మెస్సీ ఫొటోకు 5 కోట్ల 63 లక్షల (56.3మిలియన్లు) లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్ స్ట్రాలో అత్యధిక లైకులు సాధించిన పోస్ట్ గా ఈ ఫోటో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

మెస్సీ పోస్ట్ కంటే ముందుగా ఆ రికార్డు ఒక గుడ్డు ఫొటోకు ఉంది. దీనికి ‘‘మన మంతా కలిసి ప్రపంచ రికార్డు తిరగ రాద్దాం.. ఇన్ స్టాలో ఎక్కువ మంది లైక్ చేసిన పోస్టుగా మారుద్దాం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టుకు 5 కోట్ల 50 వేల లైకులు.. 34 లక్షల కామెంట్స్ వచ్చాయి. ఈ గుడ్డు ఫొటోను పోస్ట్ చేసిన ఖాతాకు ప్రస్తుతం దాదాపు 48 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ కంటే ముందు అమెరికాకు చెందిన మోడల్.. టీవీ ప్రజెంటరైన కైలీ జెన్నర్ ఫొటోకు కోటి 80 లక్షల (18 మిలియన్లు) మంది లైకులుగా రాగా 34 లక్షల మంది కామెంట్స్ వచ్చాయి. 2018 నుంచి 2019 జనవరి 4 వరకు కూడా ఈ ఫొటోనే ఇన్ స్టాలో అత్యధిక లైకులు సాధించిన ఫోటో గా నిలిచింది. ఆ రికార్డు జనవరి 4 తర్వాత గుడ్డు ఫోటో బ్రేక్ చేసింది.

తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మెస్సీ పోస్ట్ చేసిన ఒక ఫోటోను 5 కోట్ల 63 లక్షల మంది లైక్ చేశారు. దీంతో ఈ ఫొటో ఇన్ స్ట్రాలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రీసెంట్ గా వరల్డ్ కప్పు నెగ్గిన మెస్సీ తన సంబరాన్ని ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్నారు.

ఫిఫా కప్పును ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు. దీనికి అభిమానులు భారీగా లైకులు.. కామెంట్లతో తన అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు అర్జెంటీనా ఫిపా వరల్డ్ కప్ నెగ్గడంతో ఆ దేశం సంబరాలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ముందే ఆ దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.