Begin typing your search above and press return to search.

మనిషి నుంచి కుక్కకు సోకిన వ్యాధి.. ఇదే తొలి కేసు.. చాలా డేంజర్ అట?

By:  Tupaki Desk   |   17 Aug 2022 1:30 AM GMT
మనిషి నుంచి కుక్కకు సోకిన వ్యాధి.. ఇదే తొలి కేసు.. చాలా డేంజర్ అట?
X
అసహజ శృంగారం.. ఇద్దరు మగాళ్ల మధ్య శృంగారంతోనే మంకీపాక్స్ వ్యాపిస్తుందని తేలింది. మనుషుల నుంచి ఇప్పుడు పెంపుడు జంతువులకు కూడా ఈ వైరస్ సోకడం మొదలైంది. ఇది డేంజర్ వేవ్ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మంకీపాక్స్ కలవరపెడుతోంది. కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా ఓ ఫ్రెంచ్ జంటతో ఓ శునకం పడుతుందట.. వారిద్దరూ స్వలింగ సంపర్కులు. బయట కూడా సంబంధాలు కొనసాగించేవారు.  వారికి మంకీపాక్స్ సోకింది. వారిద్దరితో కలిసి బెడ్ మీద పడుకున్న  ఆ కుక్కకు కూడా వైరస్ సోకింది. పెంపుడు జంతువులకు వైరస్ సోకడం ఇదే తొలిసారి అంటున్నారు. సో అంతా కేర్ ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు.

స్వలింగ సంప్కర జంట తాజాగా ఫ్రాన్స్ లో కలిశారు. 44 ఏళ్లు, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు మగాళ్లు కలిసి ఉంటున్నారు. వారిద్దరికి బయట కూడా శారీరక సంబంధాలు ఇతరులతో ఉన్నాయి. ఇటీవల వారిద్దరూ కలుసుకున్నారు. వారి పొట్టపై దద్దర్లు రావడంతో పరీక్షలు చేయగా.. మంకీపాక్స్ అని తేలింది. ఆ కుక్క కూడా వారితో పడుకోవడంతో దానికి కూడా మంకీపాక్స్ సోకింది.

మనుషులకు మంకీపాక్స్ సోకిన 12 రోజులకు కుక్కకు వచ్చింది. దీంతో అదిప్పుడు సీరియస్ గా ఉందట.. అందుకే మంకీపాక్స్ బాధితులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వాటి వల్ల మరింత విస్తరిస్తుందని తేల్చారు.

మంకీపాక్స్ పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూ హెచ్ ఓ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మనుషులను నుంచి జంతువులకు ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో ఇప్పుడు మరింతగా ఇది ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించింది.

యూకే, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీ పాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోతులు, ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. యూకేలో శృంగారం ద్వారా కూడా సోకుతుందని.. ముఖ్యంగా గే లేదా బైసెక్సువల్ మెన్ ల ద్వారా ఇది వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకితే తలనొప్పి, చలి, కండరాల నొప్ప లాంటి లక్షణాలుంటాయి.

ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ వ్యాప్తి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యధిక హెచ్చరిక స్థాయిని ప్రకటించింది.. డబ్ల్యూహెచ్‌ఓ ఈ వైరస్‌ను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.