Begin typing your search above and press return to search.
కరోనా చైనా సృష్టే... ఇదిగో సాక్ష్యం
By: Tupaki Desk | 27 March 2020 4:15 AM GMTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో... ఆ వైరస్ పుట్టిన చైనాను అగ్రరాజ్యం మొదటి నుంచి అనుమానిస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా వైరస్ ను ఏకంగా చైనా వైరస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం కూడా మనకు తెలిసిందే. కరోనాను తాను చైనా వైరస్సే అని పిలుస్తానంటూ కూడా ట్రంప్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ట్రంప్ భావన ఏంటంటే... కరోనా వైరస్ ను చైనా ఉద్దేశపూర్వకంగానే సృష్టించిందనే. ఈ మాటను మిగిలిన దేశాలు అంత పెద్దగా పట్టించుకోలేదు గానీ... ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓ అంశం... చైనాపై ట్రంప్ వాదనను నిజం చేసేలానే ఉందని చెప్పక తప్పదు.
చైనాను బదనాం చేసేలానే ఉన్న సదరు అంశం ఏమిటన్న విషయానికి వస్తే... కరోనా వైరస్ ను చైనానే స్వయంగా అభివృద్ది చేసి తన అమ్ముల పొదిలో పెట్టుకుందని, ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదిగే దిశగా సరైన అదను చూసుకుని దానిని ప్రపంచ దేశాలపైకి వదిలేందుకు సిద్ధంగా ఉందని.. ఎఫ్పుడో 1981లో ముద్రితమైన ఓ పుస్తకంలో ఉందట. ‘ద ఐస్ ఆఫ్ ద డార్క్ నెస్’ పేరిట ఈ పుస్తకాన్ని డీన్ కూంజ్ అనే ఓ ఫిక్షన్ రైటర్ రాశారు. ఈ పుస్తకంలో డీన్ ఏం రాశారన్న విషయానికి వస్తే... ‘వూహాన్ 400’ పేరిట ఓ ప్రాణాంతక వైరస్ ను చైనా సృష్టించి దానిని వూహాన్ లోనే దాచిపెట్టిందని ఆయన రాశాను. తన దేశంలోని పేద ప్రజలను సామూహికంగా చంపేసేందుకు, అదే సమయంలో ప్రపంచ దేశాల పైకి ఈ ప్రాణాంతక వైరస్ ను వదిలేందుకు చైనా ప్లాన్ వేసిందట. అంటే.. మొత్తంగా ఈ వైరస్ ను తన బయలాజికల్ ఆయుధంగా వినియోగించుకునేందుకు చైనా ప్లాన్ సిద్ధం చేసుకుందట.
ఈ లెక్కన ఎప్పుడో 1981లోనే రాసిన తన పుస్తకంలో వూహాన్ 400 పేరిట ఓ ప్రాణాంతక వైరస్ ను చైనా తయారు చేసిందని, దానినే చైనా తన జీవాయుధంగా వినియోగించుకునేందుకు సిద్ధపడిందని డీన్ రాస్తే.. ఇప్పుడు కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా నరమేథాన్ని సృష్టిస్తున్న వైనం చూస్తుంటే... సదరు పుస్తకంలో రాసినట్లుగానే చైనా చేసిందన్న వాదనలు బలపడుతున్నాయి. అయితే డీన్ కూంజ్ రాసిన పుస్తకాలన్నీ కూడా ఫిక్షన్ ఆధారంగానే రాసినవే. ఈ నేపథ్యంలో కల్పిత గాథలతో ఎప్పుడో డీన్ రాసిన అంశాన్ని ఇప్పుడు కరోనా వైరస్ కు ముడి పెట్టి ఏదో కథలు అల్లడం కూడా భావ్యం కాదన్న వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఏదేమైనా... ఇప్పుడు చైనాలోని వూహాన్ నుంచే ప్రస్థానం మొదలెట్టిన కరోనా వైరస్ విజృంభణ చూస్తుంటే.. ట్రంప్ అనుమానపడినట్లుగానే.. చైనా దీనిని తన బయలాజికల్ ఆయుధంగా వాడిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తించడమే కాకుండా చైనాను తీవ్ర కలవర పాటుకు గుర్తి చేస్తున్నాయని కూడా చెప్పక తప్పదు.