Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడంకు కారణం ఇదేనట!

By:  Tupaki Desk   |   4 July 2021 5:37 AM GMT
వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడంకు కారణం ఇదేనట!
X
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రకరకాలుగా సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అందులో ఒకటి వ్యాక్సిన్‌ తీసుకున్న వారు రక్తం గడ్డ కట్టి నొప్పి వస్తుందని ఫిర్యాదులు చేస్తున్నారు. బ్లడ్‌ క్లాట్స్ వల్ల వచ్చే నొప్పిపై మ్యూనిచ్‌ యూనివర్శిటీ వారు పరిశోదనలు నిర్వహించారు. వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డటంకు కారణం ఏంటీ అంటూ వారు పలు రకాలుగా విశ్లేషించిన తర్వాత వారు గుర్తించిన విషయం ఏంటీ అంటే రక్తం గడ్డ కట్టడంకు వ్యాక్సిన్‌ కు అస్సలు సంబంధం లేదని వెళ్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి మాత్రమే బ్లడ్ క్లాట్స్ అవ్వడం కు కారణం వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో జరిగిన తప్పిదంగా గుర్తించారు. వ్యాక్సిన్‌ ఇచ్చే వారు కొందరు కొన్ని రకాలుగా ఇస్తున్నారు. దానికి తోడు వాడుతున్న ఇంజెక్షన్ లు కూడా ఈ పరిణామంకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్ లు తీసుకన్న వారికి కూడా బ్లడ్ లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఇది వ్యాక్సిన్ తప్పిదం కాదని భావించిన యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేసి వ్యాక్సిన్‌ ఇస్తున్న వారిని పరిశీలించారు.

వారిలో కొందరు కొన్ని రకాలుగా వేస్తున్నారు. వారు వస్తున్న సమయంలో చేస్తున్న తప్పిదాల వల్ల వ్యాక్సిన్‌ ఇంజెక్షన్ అనేది చర్మాంతర్గత కణజాలం వరకు మాత్రమే చేరుతుంది. దాంతో రక్తం గడ్డలుగా మారుతుందని అంటున్నారు. కేవలం కరోనా వ్యాక్సిన్‌ మాత్రమే కాదు ఏ వ్యాక్సిన్‌ లేదా ఇతర ఇంజెక్షన్‌ లు వేసినా కూడా చర్మాంతర్గత కణజాలం వరకు మాత్రమే నిడిల్‌ ను వెళ్లనిచ్చి మందు వేయడం వల్ల రక్తంలో గడ్డలు కడుతుంది. అందుకే వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సదరు యూనివర్శిటీ వారు వెళ్లడించారు.

కొందరు వ్యాక్సిన్‌ వేసే సమయంలో చర్మంను పట్టుకుని లాగి వేస్తున్నారు. తద్వార ఇంజెక్షన్ అనేది లోనికి వెళ్లడం జరగడం లేదు. తద్వార వ్యాక్సిన్‌ కణజాలం వరకు మాత్రమే వెళ్తుంది. ఈ పరిణామం వల్ల వ్యాక్సిన్‌ పనితనంపై ప్రభావం చూపడంతో పాటు రక్తం గడ్డ కడుతుందని వారు చెప్పారు. వ్యాక్సిన్‌ వేసే సమయంలో అస్సలు చర్మం ను లాగద్దు. చర్మాన్ని వత్తి కూడా పట్టవద్దు.

ప్లాట్ గా ఉన్న స్కిన్‌ పై ఇంజక్షన్ వేయడం వల్ల లోతుగా ఇంజెక్షన్‌ వెళ్లి రక్తం గడ్డ కట్టదని వారు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసే సమయంలో నిడిల్ ను వంకరగా కాకుండా లోతుగా వెళ్లేలా స్ట్రెయిట్‌ గా వేయాలని కూడా వారు సూచిస్తున్నారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో శాంపిల్స్ తీసుకుని వీరు ఈ అధ్యయనం చేసినట్లుగా చెబుతున్నారు.