Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు పెద్ద టెన్షన్ ఇదే

By:  Tupaki Desk   |   7 Oct 2019 6:25 AM GMT
ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు పెద్ద టెన్షన్ ఇదే
X
అసలే దసరా సీజన్.. తెలంగాణకు పెద్ద పండుగ ఇది. ఆపై హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేడి.. ఇలాంటి సమయంలో ఆర్టీసీ సమ్మె తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు పెద్ద టెన్షన్ గా మారింది. లోక్ సభ ఎన్నికలే తెలంగాణ రాష్ట్ర సమితి నైతిక స్థైర్యాన్నిదెబ్బ తీశాయి. ఆ తర్వాత మంత్రివర్గ ఏర్పాటు సమయంలో లుకలుకలు బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో హుజూర్ నగర్ బై పోల్ ఆ పార్టీకి పెద్ద పరీక్షగా మారింది.

వాస్తవానికి ఈ సీటులో టీఆర్ఎస్ నెగ్గకపోయినా పోయేది ఏమీ లేదు. అది స్వయానా పీసీసీ అధ్యక్షుడి సీటు, కాంగ్రెస్ కంచుకోట. ఓడిపోయినా తెలంగాణ రాష్ట్రసమితి ఏదోలా వాదించవచ్చు. ఈ వాదనలను వినిపించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అది నైతిక విజయం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ విభాగాన్ని కేసీఆర్ విలీన పరుచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొద్దో గొప్పో నెగ్గింది. ఉనికి చాటుకుంది. ఇలాంటి నేపథ్యంలో హుజూర్ నగర్లో కాంగ్రెస్ నెగ్గితే ఆ పార్టీకి మరింత స్థైర్యం వస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సమితికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అని ఆ పార్టీ నేతలు ప్రకటించుకుంటారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అనే స్వరాలు మళ్లీ లేస్తాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. చంద్రబాబు తో పొత్తు తప్పై పోయిందని, ఇక నుంచి సోలోగా సాగితే తమకు తిరుగులేదని కాంగ్రెస్ వాళ్లు లెక్కలేస్తారు. కాబట్టి ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతిష్టాత్మకం అవుతోంది.

ఇలాంటి ప్రతిస్టాత్మక ఎన్నికల వేళ ఆర్టీసీ బస్సులు బంద్ అయిపోవడం కేసీఆర్ పై వ్యతిరేకతను పెంచే అంశమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ ఉద్యోగులకు తిరుగుండదని ఉద్యమం అప్పుడు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లు గడిచిపోయినా వారికి ఎలాంటి సాయంగా నిలవలేకపోయాడు. ఈ నేఫథ్యం అవకాశం చూసి.. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉప ఎన్నికలను చూసి అయినా కేసీఆర్ వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏర్పడుతూ ఉందిప్పుడు