Begin typing your search above and press return to search.
దేశంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం: మోడీ
By: Tupaki Desk | 23 July 2020 3:30 PM GMTభారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో మోడీ మాట్లాడుతూ భారతదేశం అవకాశాల గని అవతరించిందని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నడూ లేదని అన్నారు. భారతదేశంలో మానవ వనరులు.. భూమి, అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని.. ఇది మీకు మంచి అవకాశం అందిస్తుందని ఆయన అన్నారు.
లాక్డౌన్ సమయంలోనూ భారతదేశానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మోడీ చెప్పారు. భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఫేస్‌బుక్, గూగుల్ లు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. అమెరికా పెట్టుబడిదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇది సరైన సమయమని.. భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చుతున్నామని పిలుపునిచ్చారు.. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రెండు రోజుల వర్చువల్ సమ్మిట్‌లో మోదీ మాట్లాడారు. కరోనావైరస్ అనంతర రికవరీ ఎజెండాను నిర్దేశిస్తున్న అమెరికా-భారత్ దేశాల కు ఇది మంచి అవకాశాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నానన్నారు
భారతదేశం వ్యాపార స్నేహపూర్వక దేశం అని మోడీ అన్నారు. ప్రపంచ బ్యాంకు వ్యాపార రేటింగ్ ఇవ్వడం చాలా సులభం అని ఆయన ఉదహరించారు. "కీలకమైన వ్యాపార రేటింగ్ లో భారతదేశం రేటింగ్ పెరిగింది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్స్ కూడా బాగుంది" అని మోడీ అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో, ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 190 దేశాలలో భారతదేశం 14 స్థానాలు పెరిగి 63 వ స్థానంలో నిలిచిందన్నారు. 50 వ స్థానం కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని చెప్పారు.
ప్రతి సంవత్సరం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో రికార్డు స్థాయికి చేరుకుంటున్నామని మోడీ అన్నారు. ప్రతి సంవత్సరం మునుపటి సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు. కరోనావైరస్ అనంతర ఆర్థిక పరిస్థితి వైపు చూస్తూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ఆప్టిమైజేషన్ పై చాలా దృష్టి పెట్టమని ప్రజలకు నేర్పించిందని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా పెట్టుబడిదారులకు.. కంపెనీలకు మోడీ పిలుపుతో ఆశించిన ఫలితాల వస్తాయని పారిశ్రామక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.