Begin typing your search above and press return to search.
కోడిగుడ్లను తినేవారందరికీ ఇది షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 17 Nov 2020 7:00 AM ISTకోడిగుడ్లంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. చాలా మంది వీటిని ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్ రూపంలో తింటారు. కొందరు కూర చేసుకు తింటారు. చికెన్, మటన్ తినని వారు కూడా కోడిగుడ్లను తింటారు.
చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దానిని తినరు. వారి అభిప్రాయంలో నాన్‌వెజ్ కేటగిరీకి చెందిన కోడి... ఈ గుడ్డును పెడుతుంది. ఈ కారణంగానే దీనిని నాన్‌వెజ్‌గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్‌వెజ్ ప్రియుల ప్రశ్న. ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే.. గుడ్డులో మాత్రం ఎన్నో రకాల మంచి పోషకాలున్నాయి..
గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిలో ఎంటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమని తేల్చిచెప్పారు. ఇక పచ్చసొన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. కాబట్టి గుడ్డు శాఖాహారమని కొందరు వాదిస్తున్నారు.. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా.. ఎన్నో పోషకాలున్న గుడ్డును ఇలా నాన్ వెజ్ పేరు తో పక్కకు పెడితే.. ఆ సంపూర్ణ ఆహారానికి మీరు దూరమైనట్టే..
కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం అని ప్రతిరోజు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులకు రొజుకొకటి చొప్పున గుడ్డును పెడుతున్నారు. పెద్దలు కూడా గుడ్లు విరివిగానే తింటారు. అయితే ఏది అయినా ఎక్కువగా తింటే ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అయితే నిత్యం ఒకటి కన్నా ఎక్కువ కోడిగుడ్లను తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు వివరాలు వెల్లడించారు.
చైనాలో 1991 నుంచి 2009 మధ్య గుడ్లను ఎక్కువగా తినే వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నిత్యం ఒకటి అంతకన్నా ఎక్కువ గుడ్లను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60శాతం పెరిగాయని గుర్తించారు. సో సంపూర్ణ ఆహారం అని గుడ్డును ఎక్కువగా తినే వారు జర జాగ్రత్త వహిస్తే మంచిది మరి..