Begin typing your search above and press return to search.

దిస్​ ఈజ్​ రైనా..! మొదటి మ్యాచ్​ లోనే దుమ్ము లేపాడు..!

By:  Tupaki Desk   |   11 April 2021 6:30 AM GMT
దిస్​ ఈజ్​ రైనా..! మొదటి మ్యాచ్​ లోనే దుమ్ము లేపాడు..!
X
సురేశ్​ రైనా సీఎస్​కే జట్టులోని ఓ మణిపూస. కానీ అబుదాబిలో జరిగిన గత సీజన్​ లో అతడు వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చేశాడు. రైనాకు బాల్కనీ ఉన్న హోటల్​ గది కేటాయించలేదని.. అందుకే అతడు అవమానంగా ఫీలయ్యి వచ్చేశాడని అప్పట్లో టాక్​ వినిపించింది. ఇదిలా ఉంటే గత సీజన్​ లో చెన్నై ఘోరమైన ఆటతీరును కనబర్చింది. కనీసం ప్లే ఆప్స్​ కు కూడా వెళ్లకుండా వెనుదిరిగింది. ఒకవేళ రైనా ఉండి ఉంటే సీఎస్​కే రాణించి ఉండేదన్న వాదన వినిపించింది.

తాజాగా జరిగిన మ్యాచ్ లో రైనా సీఎస్​కే తరపున అదరగొట్టాడు. నిన్న జరిగిన మ్యాచ్​ లో సీఎస్​కే .. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో సీఎస్​కే ఓడిపోయినప్పటికీ .. రైనా రీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అతడు అద్భుతమైన ఆటతీరును కనబరిచి ప్రేక్షకులను మెస్మరైజ్​ చేశాడు.రైనా.. కేవలం 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. చివరకు జడేజాతో చిన్న కమ్యూనికేషన్​ గ్యాప్​ తో రన్​ అవుట్​ కావాల్సి వచ్చింది.

రైనా ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గత సీజన్​ లో నీకు బాల్కనీ ఉన్న హోటల్​ గది కేటాయించలేదని అలిగావట. ఆ సారి బాల్కనీ కాదు.. దాని బాబు లాంటి హోటల్​ ను బుక్​ చేస్తారు’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మొదటి మ్యాచ్​లోనే హాఫ్​ సెంచరీ కొట్టడం పట్ల రైనా పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్​ లో సీఎస్​కే బ్యాట్స్​మెన్లు చెలరేగి ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటింగ్​ అనుకూలం కావడంతో చెన్నై బ్యాట్స్​మెన్లు బాగానే పరుగులు రాబట్టారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్​ తరఫున పృథ్వీ షా, శిఖర్​ ధావన్​ చెలరేగి ఆడటంతో ఆ జట్టు అలవోకగా విజయం సాధించింది. శ్రేయస్​ అయ్యర్​ లేకపోయినా.. రిషబ్​ పంత్​ జట్టును ఎంతో నేర్పుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే సురేశ్​ రైనా ఆటతీరుపై సెహ్వాగ్​ కూడా ప్రశంసించాడు.