Begin typing your search above and press return to search.

అంద‌రికీ సంతృప్తి.. ఇదేనా జ‌గ‌న్ ఫార్ములా..?

By:  Tupaki Desk   |   28 Sept 2021 6:00 AM IST
అంద‌రికీ సంతృప్తి.. ఇదేనా జ‌గ‌న్ ఫార్ములా..?
X
రాష్ట్ర మంత్రివ‌ర్గాన్ని మారుస్తున్నారు. అంతేకాదు.. పూర్తిగా 100 శాతం మారుస్తున్నారు. నేను కూడా మంత్రి ప‌ద‌విని కోల్పోతున్నాను.-ఇదీ.. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిచేసిన ప్ర‌క‌ట‌న‌. ఈ ప్ర‌క‌ట‌న రాగానే.. వైసీపీలోనే విస్మ‌యం వ్య‌క్త‌మైంది. ఎందుకంటే.. ఎంతో మంది సీనియ‌ర్లు ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్నారు. వీరిలో మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి, బొత్స స‌త్యానారాయ‌ణ వంటివారు కూడా ఉన్నారు. మ‌రి వీరిని కూడా తీసేస్తే.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌పాటు.. ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డ‌దా? గ‌ట్టివాయిస్ వినిపించేవారు.. ప్ర‌భుత్వానికి లేక‌పోతే.. ఇబ్బందులు క‌ల‌గ‌వా? అనేది.. వైసీపీ సీనియ‌ర్ల మాట‌. దీంతోనే విస్మ‌యానికి గుర‌య్యారు. వాస్త‌వానికి జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే క్ర‌మంలో 90 శాతం మందిని మారుస్తాన‌ని అన్నారు.

దీంతో ఆ 10 శాతంలో మంది ఖ‌చ్చితంగా ఉంటార‌ని అంద‌రూ అనుకున్నారు. ఆ ప‌ది శాతం కూడా.. సీనియ‌ర్లే అయి ఉంటార‌నే అంచనా వేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు 100 శాతం మార్పు ఉంటుంద‌ని స్వ‌యంగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్ని హిత మంత్రే చెప్ప‌డాన్ని బ‌ట్టి.. పూర్తిగా మంత్రుల‌ను ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. వీరికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక చాలా వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ సీనియ‌ర్లు.. కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

వ్యూహం లేకుండా జ‌గ‌న్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌ర‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇటీవ‌ల పార్టీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌తో భేటీ అయిన‌ప్పుడు ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ సూచ‌న‌ల మేర‌కు.. ఈ 100 శాతం నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. దీని వ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలను జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు సీనియ‌ర్లు చెబుతున్నారు. ఒక‌టి పార్టీలో అసంతృప్తులు తొల‌గించ‌డం.. రెండు పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం. అసంతృప్తులు అంటే.. మంత్రి వ‌ర్గంలో కొంద‌రిని తొల‌గించి.. మ‌రికొంద‌రిని ఉంచితే.. తీసేసిన వారిపై బ్యాడ్ ఇంపాక్ట్ ప‌డుతుంది. వారు స‌రిగా ప‌నిచేయ‌లేదు. లేదా.. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే విశ్లేష‌ణ‌లు.. విమ‌ర్శ‌లు జోరందుకునే అవ‌కాశం ఉంటుంది.

దీంతో వారు అన్య‌మ‌స్కంగానే పార్టీలో కొన‌సాగుతారు. అలా కాకుండా.. గుండుగుత్తుగా అంద‌రినీ తప్పించేస్తే.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ సూచించిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. సో.. ఇదొక వ్యూహం. ఇక‌, రెండో వ్యూహానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం తీసేస్తున్న మంత్రుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా వారిపై మ‌రింత బాధ్య‌త పెట్టిన‌ట్టు అవుతుంద‌ని.. పార్టీని గెలిపించుకుంటే.. మ‌ళ్లీ ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని ఉత్సాహంతోపాటు.. త‌మకు స‌మ ప్రాధాన్యం ద‌క్కింద‌నే భావ‌న వారిలో ఉంటుంద‌ని .. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇలా.. ఈ రెండు వ్యూహాల నేప‌థ్యంలో తొలుత 90 శాతం అనుకుని కూడా ఇప్పుడు త‌న నిర్ణ‌యాన్ని 100 శాతానికి మార్చుకున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.