Begin typing your search above and press return to search.

హిమాయత్ నగర్ లో పిచ్చికుక్క ఎంత ఆగమాగం చేసిందంటే?

By:  Tupaki Desk   |   22 Aug 2020 6:00 AM IST
హిమాయత్ నగర్ లో పిచ్చికుక్క ఎంత ఆగమాగం చేసిందంటే?
X
ఒక్క పిచ్చికుక్కు.. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలోని వారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గంటల వ్యవధిలో ఈ పిచ్చికుక్కు దెబ్బకు.. దాదాపుగా పాతిక మందికి పైనే బాధితులుగా మారారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు. నారాయణగూడ హిందూ శ్మశాన వాటిక నుంచి గురువారం ఉదయం బయటకు వచ్చిన ఒక కుక్క అనూహ్యంగా వ్యవహరించింది.

వీధుల్లోకి తిరగటం మొదలెట్టిన సదరు కుక్క.. ఎవరు కనిపిస్తే వారి మీద పడటం మొదలెట్టింది. ఈ కుక్క దెబ్బకు బాధితులుగా మారిన వారిలో మనుషులే కాదు.. పలు రకాల జంతువులు కూడా ఉండటం గమనార్హం. దాదాపుగా పాతిక మందిని ఈ కుక్క బారిన పడినట్లుగా చెబుతున్నారు. హిమాయత్ నగర్.. దోమల గూడ ప్రాంతంలో హల్ చల్ చేసిన ఈ కుక్క కారణంగా పలువురు గాయపడ్డారు.

దీంతో.. ఈ పిచ్చికుక్క దెబ్బకు అక్కడి వారంతా హడలిపోయారు. దీని గురించి సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. సదరు పిచ్చికుక్కతో పాటు.. పలు కుక్కల్ని పట్టుకొని తరలించారు. ఇక.. కుక్క దెబ్బకు గాయాలైన వారు వైఎంసీఏలోని ఐపీఎం.. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రులకు పరుగులు తీసి.. వైద్యం చేయించుకున్నారు.