Begin typing your search above and press return to search.

టాక్స్ కట్టేవాళ్లందరికీ ఇది గుడ్‌న్యూస్!

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:30 AM GMT
టాక్స్ కట్టేవాళ్లందరికీ ఇది గుడ్‌న్యూస్!
X
మనకు వస్తున్న ఆదాయంలో కొంత భాగం ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. అయితే పరిమితి ప్రకారంగా పే చేయాల్సి ఉంటుంది. 2021 పన్ను విధానం ప్రకారం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 5లక్షల నుంచి 10 లక్షల లోపు వారు 20 శాతం చెల్లించాలి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుడ్ న్యూస్ చెప్పనుంది. 2023-24 కేంద్ర బడ్జెట్ లో కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల జీతం పొందేవారు ఇక నుంచి 20 శాతం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం 10 శాతం చెల్లిస్తే చాలు. మిగతా ఆదాయం వారికి కూడా స్లాబులను మార్చింది. అందుకు విధి విధానాలను రూపొందిస్తున్నారు. ప్రధాని కార్యాలయం ఆమోదం తరువాత దీనిని వచ్చే బడ్జెట్ లోప్రవేశ పెట్టనున్నారు.

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపథ్యంలో 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాను మధ్యతరగతి నుంచే వచ్చాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో మిడిల్ క్లాస్ ను ఆకట్టుకునే బడ్జెట్ ఉంటుందనే సంకేతాలు ఇవ్వడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను విధానంలో మార్పులు తీసుకురానున్నారు.

ప్రస్తుత పన్ను విధానం ప్రకారం.. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం పొందేవారు 20 శాతం చెల్లించాలి. 10 లక్షల ఆదాయం దాటితే 30 శాతం చెల్లించాలి. ఈ విధానం ప్రకారం కొంత మంది ఆదాయం పెరిగినా పన్నుల రూపంలో ప్రభుత్వానికే వెళ్తోంది. దీంతో వారికి భారం తగ్గించే దిశగా మార్పులు తీసుకురానున్నారు. 10 లక్షల ఆదాయం లోపు వచ్చే ఎక్కువగా మధ్యతరగతి వారే ఉన్నందున కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త విధానం ప్రకారం.. వార్షికాదాయం రూ.5 లక్షల నుంచి 7.5లక్షల లోపు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను విధిస్తారు. 7.5 లక్షల నుంచి 10 లక్షల లోపు వారికి 15 శాతం పన్ను విధిస్తారు. 10 లక్షల నుంచి 12.5 లక్షల లోపు వారికి 20 శాతం, 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, 15 లక్షల నుంచి ఆ పైన 30 శాతం విధించేలా రూపొందిస్తున్నారు.

అంటే ఇప్పుడున్న పన్నుల్లోంచి సగానికి తగ్గించనున్నారు. అయితే కొత్త విధానంలో మినహాయింపులు చూపేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం పన్ను విధానాన్ని 2021లో తీసుకొచ్చారు. పాతన పన్ను విధానంలో కేవలం మూడు స్లాబులే ఉన్నాయి. కొత్త విధానంలో ఆరు స్లాబులు ఉంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.