Begin typing your search above and press return to search.
వీళ్ళకసలు ఇంగితం ఉందా? రెండేళ్లపాపను మాస్క్ లేదని ఫ్లైట్ నుంచి దింపారు!
By: Tupaki Desk | 15 Dec 2020 9:15 AM ISTకరోనా నిబంధనలపేరుతో కొందరు విమానయాన సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఊహతెలిసిన వాళ్లు, పెద్దవాళ్లు మాస్కు పెట్టుకోవాలని చెప్పడం నిబంధనల్లో భాగమే. అటువంటి నిర్ణయాలను అందరూ హర్షిస్తారు కూడా. కానీ ఊహతెలియని చిన్నారులు, ఏడాది రెండేళ్ల పిల్లలను మాస్కు పెట్టుకోలేదని విమానం నుంచి గెంటేస్తున్నారు. తాజాగా అమెరికా విమాన సిబ్బంది ఇటువంటి బుద్ధిలేని చర్యకు పాల్పడ్డారు. రెండేళ్ల చిన్నారి మాస్క్పెట్టుకోలేదని ఆ పాపతోపాటు ఆమె తల్లిదండ్రులను కూడా విమానం నుంచి గెంటేశారు. అంతేకాకుండా వారి కుటుంబం జీవితాంతం విమానం ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
విమానయాన సిబ్బంది తీరును నెటిజన్లు మండి పడుతున్నారు. నిబంధనల పేరుతో అత్యుత్సాహం తగదని సూచిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..
అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ లో ఇటీవల ఓ కుటంబాన్ని విమానయాన సిబ్బంది బలవంతంగా కిందకు గెంటేశారు. ఇందుకు కారణం రెండేళ్ల చిన్నారి మాస్క్ పెట్టుకోక పోవడమే. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ను చిన్నారి తల్లి ఎలిజ్ ఆర్బన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
‘మా పాప ఫేస్‌మాస్క్ సరిగ్గా ధరించలేదని మమ్మల్ని అన్యాయంగా కిందకు దించేశారు. అంతేకాకుండా జీవితాంతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయకూడదని మాపై నిషేధం విధించారు.’ అంటూ వీడియోలో ఎలిజ్ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే వీడియోలో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తున్నది. పాప తండ్రి మాస్క్ పెట్టేందుకు ట్రై చేస్తున్నాడు. కానీ ఆ చిన్నారి మాస్క్ ను తీసేస్తున్నది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విమానయాన సిబ్బంది తీరును నెటిజన్లు తప్పు పడుతున్నారు.