Begin typing your search above and press return to search.
ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి : ప్రధాని మోడీ
By: Tupaki Desk | 14 Nov 2020 5:20 PM ISTదేశ ప్రజలందరికి ప్రధాని నరేంద్రమోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరిన్ని వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా, మోదీ ఈసారి కూడా దీపావళిని సరిహద్దులలో సైనికులతో కలిసి జరుపుకోబోతున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యంతోనే వికాసమని, ఆరోగ్యమే మహద్భాగ్యమనే నినాదమే స్ఫూర్తిమంతమని అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజును ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సరిహద్దులో కాపలా కాస్తూ మనల్ని అనుక్షణం రక్షిస్తున్న సైనిక కుటుంబాలకు మనం రుణపడి ఉన్నామని, వారికి వందనం సమర్పిస్తూ దీపావళికి ఒక ప్రమిదను వెలిగించాలని ప్రధాని నిన్న ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరే మోదీ దీపావళిని పురస్కరించుకుని శనివారం దేశ సైనికులతో ఈ పండుగ జరుపుకోనున్నారు. 2014 నుంచి దీన్ని ఆయన అలవాటుగా మార్చుకున్నారు. శనివారం ఆయన తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్ళవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి . అయితే అదే సమయంలో రాజస్తాన్ లోని జైసల్మీర్ కు వెళ్లి అక్కడ ఘనంగా జరిగే ఫెస్టివల్ లో పాల్గొంటారని కూడా తెలుస్తోంది. అటు. వీర జవాన్లకు కూడా మోదీ దీపావళి శుభా కాంక్షలు అందజేశారు.