Begin typing your search above and press return to search.

నిద్రపోతే.. లక్ష జీతం ఇస్తానంటున్న బెంగళూరు కంపెనీ

By:  Tupaki Desk   |   2 Sep 2020 8:10 AM GMT
నిద్రపోతే.. లక్ష జీతం ఇస్తానంటున్న బెంగళూరు కంపెనీ
X
ఉద్యోగం ఏదైనా కానీ.. ఎంత కమిట్ మెంట్ తో పని చేసినా.. వర్క్ ప్లేస్ లో కాసింత కునుకు తీయటాన్ని తప్పుగా.. భారీ నేరంగా పరిగణించటం తెలిసిందే. ఎవరైనా ఆఫీసుల్లో కునుకు తీస్తూ కనిపిస్తే వారి మీద చర్యలు తీసుకోవటం మామూలే. అందుకు భిన్నంగా బెంగళూరుకు చెందిన కంపెనీ ఒకటి భిన్నమైన ఆఫర్ ఒకటి ఇస్తోంది. నిద్ర పోయినందుకు భారీ జీతాన్ని ఆఫర్ చేస్తోంది.

బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ స్లీప్ ఇంటర్న్ షిప్ తో ముందుకు వచ్చింది. దీనికి ఎంపికైన వారంతా రాత్రి తొమ్మిది గంటలకు శుభ్రంగా పడుకోవాలన్నది రూల్. అలా చేస్తే లక్షజీతాన్ని ఇస్తామని చెబుతున్నారు. కాకుంటే.. బెడ్ మీదకు వెళ్లిన పది నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలో నిద్రలోకి జారిపోవాలి. అలా కునుకు తీయటం.. బద్దంగా ఉండటం అదనపు అర్హతలుగా చెబుతున్నారు.

ఈ ప్రోగ్రామ్ లో ఎంపికైన వారికి బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్ పర్ట్స్.. న్యూట్రిషనిస్టులు.. ఇంటీరియల్ డిజైన్లు.. పిట్ నెస్ నిపుణులు పలు సూచనలు చేస్తారని చెబుతున్నారు. వీరంతా కలిసి ఎక్కువసేపు నిద్రపోయేలా చేస్తారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈ ఇంటర్న్ షిప్ కోసం గత ఏడాది 1.7లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. అందులో 23 మందిని ఎంపిక చేశారు. అందులో 21 మంది మనోళ్లు అయితే.. ఇద్దరు విదేశీయులు. ఈసారి కూడా అంతే మందిని ఎంపిక చేస్తారిన చెబుతున్నారు. నిద్రపోయే ఉద్యోగానికి ఇంత భారీగా డబ్బులు ఇస్తానన్న మాట.. ఎన్ని లక్షల మందిని అప్లై చేస్తారో చూడాలి.